Political News

ఏపీలో ఆ డ‌బ్బులు ఏమ‌వుతున్నాయ్ బ్రో!!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చుకుంటే బాగానే ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటోంది. పెట్టుబడులు, ప‌రిశ్ర‌మల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇత‌ర ఆదాయ మార్గాలైన ప‌న్నులు, స‌ర్ చార్జీలు, వ్యాట్ ఇలాంటి వాటి రూపంలో ప్ర‌జ‌ల నుంచి బాగానే పిండుతున్నారు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎక్క‌డా లేని చెత్త‌పై ప‌న్నును వ‌సూలు చేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం ఏపీనే! ఇక‌, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు కూడా ఆకాశాన్ని అంటుతున్న రాష్ట్రం, ప‌న్నులు వేసేస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే.

సో.. వీటి వ‌ల్ల ఏపీ ప్ర‌భుత్వానికి బాగానే సొమ్ములు స‌మ‌కూరుతున్నాయి. అయితే, వీటికి లెక్క‌లు ఏవీ? అంటే మాత్రం చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పోనీ.. ఉద్యోగుల‌కు స‌మ‌యానికి జీతాలు ఇస్తున్నారా? అంటే లేదు. ప్ర‌స్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందడం అనేది కలగా మిగిలి పోతోంది. ఈ నెల ఇంకా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి రూ.1300 కోట్లు చెల్లించాల్సి ఉంది. నెల నెలా ఇదేతంతుగా కూడా మారిపోయింది.

అంద‌రికీ జీతాలు అందేసరికి నెలలో 20వ తేదీ వస్తోంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఇదే కొనసాగుతోంది. ఖజానాకు వచ్చే వేల కోట్ల ఆదాయం నుంచి ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఎలాంటి ఆటంకం లేకుండా ఇవ్వొచ్చు. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఆపుతోంది. ఈ నెలలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు పడలేదు.

ఆదాయం స‌రే.. అప్పులేమ‌య్యాయి?

ఏపీ ఆదాయం సంగ‌తి అలా ఉంచితే.. ఆర్‌బీఐ నుంచి రూ.2,500 కోట్ల వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఎస్‌డీఎఫ్ కింద ప్ర‌భుత్వం అప్పు తెచ్చింది. ఇవి కాకుండా ఓడీ అప్పు కింద ఇంకో రూ.2000 కోట్లు తెచ్చుకున్నట్టు సమాచారం. ఈ అప్పులతో పాటు నవంబరు 1వ తేదీ ఆర్‌బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి రూ.1413 కోట్ల అప్పు తెచ్చారు. ఇవన్నీ కలుపుకొంటే ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు ఇవ్వవచ్చు. కానీ, ఇవ్వ‌డం లేదు. మ‌రి ఆ సొమ్ములు ఏమైన‌ట్టు? పోనీ.. ఖ‌జానా అయినా నిండుగా ఉందా? అంటే లేదు. ఖ‌జానా ఎప్ప‌టిక‌ప్పుడు ఖాళీగానే ఉంటోంది.

కాగ్ ఏమందంటే..

రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో 300 రోజులకుపైగా వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఎస్‌డీఎఫ్‌, ఓడీ అప్పులతోనే గడుపుతోంది. వీటిని పరిమితికి మించి అతిగా వాడుతోంది అని ఇటీవల కాగ్‌ తన నివేదికలోనూ, ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ‘క్రిసిల్‌’ సీఆర్డీఏ బాండ్లపై ఇచ్చిన రిపోర్టులోనూ వెల్లడించాయి. వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఓడీలను అతిగా వాడడం అంటే బలహీన ఆర్థిక వ్యవస్థకు సంకేతమని అవి తేల్చేశాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులను మాత్రం తగ్గించుకోవడం లేదు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా అంటే అదీ లేదు. మ‌రి నిధులు ఏమ‌వుతున్నాయ‌నేది ప్ర‌శ్న‌గా మారింది.

This post was last modified on November 5, 2022 1:31 pm

Share

Recent Posts

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

4 minutes ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

1 hour ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

2 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

2 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

2 hours ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

3 hours ago