తన స్నేహితురాలు.. తన స్నేహితుడే అయిన మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న కోపంతో ఆమె కూతురిని హత్య చేసి చంపాడు ఓ దుర్మార్గుడు. ఇప్పుడా చిన్నారి తండ్రి.. తన కూతురు పోయిన బాధను తట్టుకోలేక తన ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పుడా ఇల్లాలి పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇటీవల ఘట్‌కేసర్‌లో ఆరేళ్ల పాప ఆద్య హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిన్నారి తండ్రి తన ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబంలో మరింత విషాదం చోటు చేసుకుంది. ఆద్య తండ్రి కళ్యాణ్.. శనివారం భువనగిరి రైల్వేస్టేషన్ దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం క్రితమే ఆద్యను కరుణాకర్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. తన పాప మరణంతో కళ్యాణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అంతే కాక ఈ వ్యవహారంతో కుటుంబ పరువు పోయిందని కుమిలిపోయాడు. ఈ నేపథ్యంలోనే భువనగిరిలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న కళ్యాణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
భువనగిరికి చెందిన కల్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అమ్మాయిని 2011లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఆద్య అనే ఆరేళ్ల పాప ఉంది. మూడేళ్లుగా వీరి కుటుంబం పోచారంలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటోంది. ఐతే రెండేళ్ల కిందట సెల్‌ఫోన్ లావాదేవీల విషయంలో కళ్యాణ్ భార్యకు.. కరుణాకర్‌తో పరిచయమైంది. అతను ఆమెను తరచుగా కలుస్తుండే వాడు. ఐతే కరుణాకర్ ద్వారా పరిచయమైన రాజశేఖర్ అనే మరో వ్యక్తి.. ఆమెకు సన్నిహితుడయ్యాడు. వీరి స్నేహం కరుణాకర్‌కు నచ్చలేదు. వీరి సంగతి తేల్చేందుకు కరుణాకర్.. ఆ మహిళ ఇంటికి వెళ్లడం.. అక్కడ రాజశేఖర్ ఉన్నట్లు తెలుసుకోవడం.. కత్తితో దాడికి ప్రయత్నించిన కరుణాకర్‌కు భయపడి రాజశేఖర్ ఓ గదిలో దాక్కోవడం.. బయటికి రాకుంటే ఆ మహిళ కూతురు ఆద్యను చంపేస్తానని కరుణాకర్ బెదిరించడం.. రాజశేఖర్ బయటికి రాకపోవడంతో అన్నంత పనీ చేయడం.. ఇవన్నీ నిమిషాల్లో జరిగిపోయాయి. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆద్య.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఇప్పుడు ఆమె తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
This post was last modified on July 11, 2020 10:44 pm
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…
ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…
పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…
తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…