ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్‌గా ఉంది. టీడీపీకి కంచుకోట అనే ఈ జిల్లాపై వైసీపీ అధినేత జగన్ కన్నేశారు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ పట్టు పెంచుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని టెక్కలిలో ఓడించి తీరాలనేది ఆయన సంకల్పంగా ఉంది. అందుకే ఇక్కడ టికెట్‌ను కూడా దువ్వాడ శ్రీనివాస్‌కు ముందుగానే కన్ఫర్మ్ చేశారు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లోనూ నాయకులను అలెర్ట్ చేశారు.
ఎట్టి పరిస్థితిలోనూ ఇప్పుడు గెలుచుకున్న స్థానాల్లో ఓటమి రాకూడదని గట్టిగా చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చాపురం, టెక్కలి స్థానాలను టీడీపీ గెలుచుకుంది. మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇక, శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అయితే, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనేది జగన్ సంకల్పం. ఈ నేపథ్యంలో ఇక్కడ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపించేలా ఇక్కడ మెగా వైద్య శాలను నిర్మిస్తున్నారు.
అదే విధంగా ఉపాధి కల్పన, వలసల నిరోధానికి కూడా జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో అసంతృప్తి పొడచూపకుండా కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఇక్కడ వైసీపీ జోరు పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్, మంత్రి సీదిరి అప్పలరాజులు పైర్ బ్రాండ్‌రాజకీయాలకు కేరాఫ్‌గా మారారు. దీంతో ఇక్కడ యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక, మరోవైపు మంత్రి ధర్మాన సోదరులు ఇద్దరూ కూడా మేథావులను కదిలించి విశాఖ రాజదాని సహా వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నినాదాన్ని వినిపిస్తున్నారు. సీఎం జగన్ మంచి చేస్తుంటే దీనిని టీడీపీ వాళ్లు వద్దంటున్నారంటూ ధర్మాన మేధావులను కదిలిస్తున్నారు. వరుసగా ఆయన సమావేశాలు పెట్టిమరీ.. వైసీపీకి అనుకూలంగా చక్రం తిప్పుతున్నారు. అయితే, టీడీపీకి కూడా ఇక్కడ బలమైన నాయకులు ఉన్నారు. గుండ లక్ష్మీదేవి, గౌతు శిరీష, కావలి గ్రీష్మ, అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌లు దూకుడుగా ఉన్నారు.
మిగిలిన వారు కూడా తమ తమ పంథాలో ముందుకు సాగుతున్నారు. దీంతో ఈ జిల్లాలో టీడీపీ వర్సెస్ వైసీపీ పోరు తీవ్రంగానే కనిపిస్తుండడం గమనార్హం. ఇక, బలాబలాల విషయానికి వస్తే.. ఎవరి బలం వారికే ఉంది. టీడీపీ సంస్థాగతంగా ఇప్పటికీ బలంగానే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన చోట కూడా కేడర్ చెక్కుచెదరకపోవడం పార్టీకి కలిసివస్తున్న ప్రధాన పరిణామం. ఇక, వైసీపీ విషయానికివస్తే..ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం జోరుగాసాగుతోంది.
ఇక్కడ నిర్మించాలని భావిస్తున్న పోర్టు విషయంపైనే కొంత రగడ ఉంది. ఇది కనుక సక్సెస్‌గాసాగిపోతే.. రెండు పార్టీలు హోరాహోరీ తలపడే జిల్లాల్లో శ్రీకాకుళమే ముందు వరుసలో ఉంటుందన్నది పరిశీలకుల అంచనా. ఇక, అభ్యర్థుల పరంగా కూడా జిల్లాలో రెండు పార్టీలూ బలంగానే ఉన్నాయి. సో.. ఎన్నికల ముందు ఏదైనా పెద్ద మార్పు జరిగితే తప్ప పోరు మాత్రం తీవ్రంగానే సాగనుంది.
This post was last modified on November 8, 2022 7:47 am
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్‌ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్‌ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…