జనసేన అధినేత పవన్‌కు పెద్ద దన్నే దొరికినట్టు అయింది. ఇప్పటి వరకు పార్టీకి కేడర్ లేదు. నాయకులు లేరు.. అంటూ.. పెద్ద ఎత్తున జనసేనలో ఒక చర్చ అయితే జరిగింది. దీనికి పార్టీ అధినేతగా పవన్ నుంచి ఎలాంటి ఆన్సరూ ఇప్పటి వరకు రాలేదు. కానీ, తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో జనసేనకు ఒక కీలకమైన మైలు రాయి వంటి మైలేజీ లభిస్తోంది. గతంలో మెగాస్టార్ ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక రోల్ పోషించిన నాయకులు.. చాలా మంది ఇప్పుడు జనసేనతో కలిసి నడిచేందుకు రెడీ అయ్యారు.
2007లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తయారయ్యారు. అదేవిధంగా యువ రాజ్యం పేరుతో యువతను సైతం నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగింది. వారంతా యాక్టివ్‌గానే అప్పట్లో పనిచేశారు. అయితే.. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వారు దూరమయ్యారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. తెలిసిందే. కొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే మరికొందరు మాత్రం కాంగ్రెస్ దూరంగా ఉన్నారు. ఇక, అప్పటి నుంచి దాదాపు 15 సంవత్సరాల పాటు.. వీరంతా ఎక్క డున్నారో.. ఏం చేశారో తెలియదు కానీ..తాజాగా మాత్రం పవన్‌ను బలపరిచేందుకు, జనసేన తరఫున పనిచేసేందుకు రెడీ కావడం ఆశ్చర్యంగా ఉంది. ఇటీవల వీరంతా తిరుపతి వేదికగా భేటీ అయి.. జనసేనను బలపరచాలని తీర్మానం చేశారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం స్వీకరించడంతోపాటు.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు స్వచ్ఛందంగా కలిసి రావాలని నిర్ణయించారు.
దీంతో జనసేనకు కొత్త రక్తం వచ్చినట్టు అయిందనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. మరోవైపు.. ఇప్పటికే మెగా అభిమానులు కూడా తోడవు తున్న విషయం తెలిసిందే. గతంలోనే విజయవాడ వేదికగా .. మెగా ఫ్యాన్స్ భేటీ నిర్వహించి వచ్చే ఎన్నికల నాటికి ఏకం కావాలని మెగా కుటుంబానికి ఇండస్ట్రీ పరంగానే కాకుండా రాజకీయంగా కూడా బలపరచాలని నాయకులు నిర్ణయించారు. ఇలా.. ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రజారాజ్యం మాజీ నాయకులు కూడా జనసేనకు అండగా నిలిచేఅవకాశం కనిపిస్తోంది. మరి దీనిని పవన్ ఎలా వినియోగించుకుంటారో చూడాలి.
This post was last modified on November 4, 2022 8:34 am
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…