Political News

మనుగోడు పోలింగ్.. టాప్ 10 అప్డేట్స్

దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా అభివర్ణిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు ఉదయం ప్రారంభం కాగా.. ఈ సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటల వేళకు.. చెదురుముదురు సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతూనే ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో 91 శాతం పోలింగ్ నమోదై.. అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక.. ఈ రోజు (గురువారం) జరుగుతున్న పోలింగ్ కూడా అంతే ఉత్సాహంగా జరుగుతుందని భావించినా.. ఆ ఊపు పెద్దగా కనిపించలేదంటున్నారు. చివరి గంటల్లో ఏమైనా తేడా వస్తే తప్పించి.. 2018 ఎన్నికల పోలింగ్ ను దాటే అవకాశం చాలా కష్టంగా ఉందంటున్నారు.
పోలింగ్ జరుగుతున్న వేళ.. ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల్లో కీలకమైన పది అప్డేట్స్ విషయానికి వస్తే..

  1. ఉదయం మొదలైన పోలింగ్.. 9 గంటల వేళకు 11.20 శాతం నమోదు కాగా.. పదకొండు గంటల వేళకు 25.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వేళకు నియోజకవర్గం మొత్తం కలిపి
    41.3 శాతం పోలింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు. మధ్యాహ్నం నుంచి మరింత పోలింగ్ ఊపందుకోవచ్చని చెబుతున్నారు. బీజేపీ.. టీఆర్ఎస్ అభ్యర్థులు తమకు డబ్బులు పంచుతామని చెప్పి.. పంచని కారణంగా తాము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లుగా గట్టుప్పల్ మండలంలోని అంతంపేట ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించటం సంచలనంగా మారింది.
  2. వివిధ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మూడు చోట్ల ఈవీఎంలను మార్చటంతో పాటు.. ఇప్పటివరకు 42 మందిని స్థానికేతరులుగా గుర్తించి బయటకు పంపినట్లుగా సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా..
  3. ప్రచార గడువు ముగిసినా టీఆర్ఎస్ కు చెందిన స్థానికేతరులు బయటకు వెళ్లకుండా నియోజకవర్గంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
  4. ఈవీఎం సమస్యల్ని పరిష్కరించామని.. పోలింగ్ వేళ స్థానికేతరులు ఉండటం.. పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తులు ప్రదర్శిస్తున్నారన్న కంప్లైంట్ తో ఇప్పటివరకు రెండు కేసులు.. ఆరుగురిని రిమాండ్ కు పంపినట్లుగా సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు. మొత్తం 28 ఫిర్యాదులు అందాయని.. వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
  5. తన ఫోటోను మార్ఫింగ్ చేసి.. తాను సీఎం కేసీఆర్ తో అరగంట పాటు భేటీ అయినట్లుగా సాగుతున్న సోషల్ మీడియా ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై సీఈవోకు కంప్లైంట్ చేశారు. ఈ ప్రచారాన్ని గుర్తించిన సీఈవో.. ఆయా మాధ్యమాలకు నోటీసులు పంపుతామని.. చర్యలు తీసుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు.
  6. పోలింగ్ వేళలోనూ పలు పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచే ప్రయత్నం చేయటం.. ఆ సందర్భంగా ప్రత్యర్థి పార్టీలు వాటిని బట్టబయలు చేసే ప్రయత్నం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చుండూరులో ఓటర్లకు డబ్బులు పంచుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు ఎంట్రీ ఇవ్వటంతో.. ఆ డబ్బుల్ని వదిలేసి పారిపోయారు. ఈ సందర్భంగా రూ.2లక్షల మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
  7. నియోజకవర్గంలోని పలు చోట్ల ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్ కు అంతరాయం చోటు చేసుకుంది. చుండూరు మండలం కొండాపురంలో 178వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లోపంతో అరగంట పోలింగ్ ఆగితే.. కొంపల్లిలో 145వ బూత్ లోనూ ఇదే పరిస్థితి. సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవి చెరువులోనూ ఇదే పరిస్థితి. అనంతరం ఆ లోపాల్ని సరి చేశారు.
  8. మర్రిగూడలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. గజ్వేల్ కు చెందిన టీఆర్ఎస్ నేతలు అక్కడ ఉన్నట్లుగా ఆరోపించిన కమలనాథులు.. పలువురు టీఆర్ఎస్ కు చెందిన వారిగా చెబుతున్న వారిని పోలీసులకు అప్పజెప్పారు. వీరు.. సిద్ధిపేటకు చెందిన వారుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.
  9. పోలింగ్ వేళకు స్థానికేతరులు ఎవరు నియోజకవర్గంలో ఉండకూడదు. అయితే.. టీఆర్ఎస్ నేతలు స్థానికేతరులను ఉంచి రాజకీయం చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే.. అలాంటి పని బీజేపీనే చేస్తుందని టీఆర్ఎస్ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. దీంతో.. అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
  10. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థులు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఓటు వేయలేని పరిస్థితి. కారణం.. ఆయన ఓటు నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో ఓటు ఉంది. దీంతో.. ఆయన ఓటు వేసుకోని పరిస్థితి.

This post was last modified on November 3, 2022 2:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!

ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…

3 hours ago

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

9 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

10 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

11 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

12 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

12 hours ago