ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు వరుసగా అధికారంలోకి తీసుకున్న నాయకుడిగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరుంది. వైఎస్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్‌గా నాటి రోజులు తలపిస్తాయి. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను బలోపేతం చేశారు. అధికారంలోకి తెచ్చారు. అలాంటి నాయకుడి పట్ల కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ అభిమానం చూపిస్తారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం కానీ.. ఢోకా కానీ లేదు. వైఎస్ సెంటిమెంటు ఎక్కడ అవసరం ఉన్నా.. ఇప్పటికీ వాడుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూడా వైఎస్ మావాడే.. అంటూ.. ఆయన కుమార్తెపైనే రాజకీయ దాడి చేశారు.
మరి అలాంటి వైఎస్‌ను ప్రస్తుతం కాంగ్రెస్ ఎందుకో మరచిపోయిందనే టాక్ వినిపిస్తోంది. పోనీ.. మరిచిపోకపోయినా.. ఏమరుపాటుగా అయినా.. ఆయన తలంపు లేకుండా పోయింది. దీంతో హోరా హోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల పోరాటంలో వైఎస్ బొమ్మను కానీ, ఆయన పేరును కానీ.. కాంగ్రెస్ నేతలు తలుచుకోవడం లేదు. కనీసం.. పట్టించుకోవడం కూడా లేదు. వైఎస్ పాదయాత్రలో నల్లగొండలో పర్యటించిన సమయంలో ఇక్కడి ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలు విన్నారు. ఈ క్రమంలోనే తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రయత్నాలు సాగాయి. అయితే, ఇదే సమస్య ప్రస్తుత ఏపీలోని తూర్పుగోదావరి, శ్రీకాకుళం ప్రాంతాల్లోనూ ఉంది. దీంతో ఉమ్మడిగా ఒక పరిష్కారం చూపాలని అనుకున్నారు.
సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. అంతో ఇంతో మునుగోడు ప్రజల్లో వైఎస్ పేరు నానుతోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడం లేదు. కనీసం..వైఎస్ పేరు కూడా ఎక్కడా స్మరించడం లేదు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు వైఎస్ ను వదిలేశారు. అయితే.. ఇక్కడే చిత్రంగా బీజేపీ నేతలు వైఎస్‌ను అందిపుచ్చుకున్నారు. ఆయన వేష ధారణలో ఉన్న ఒక వ్యక్తిని నియమించి.. ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారు. ఈయన కూడా అచ్చు వైఎస్ మాదిరిగానే ఉండడం.. ఆయన హావ భావాలే పలికిస్తుండడం ఆసక్తిగా మారింది.
అంతేకాదు.. “మునుగోడు గడ్డ.. రాజగోపాల్ అడ్డా.. ఎన్ని పార్టీలు ఏకమైనా రాజగోపాల్‌రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరు. నమస్తే.. నమస్తే.. ” అంటూ వైఎస్ వేషధారణలో ఉన్న వ్యక్తి ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈయన వల్ల ఓట్లు పడతాయా లేదా, అనే విషయాన్ని పక్కన పెడితే వైఎస్ ను వదిలేయడం మాత్రం కాంగ్రెస్‌కు ఇబ్బంది అనేది తెలుస్తోంది.
This post was last modified on October 31, 2022 9:53 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…