రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఎలా ముందుకు సాగాలి? ఎంతసేపూ.. కేంద్రంపైనే ఆధారపడాలా? లేక మనకంటూ.. ఏమైనా ఆలోచన ఉందా? ఇదీ.. బీజేపీ రాష్ట్రనాయకుల్లో జరుగుతున్న చర్చ. తాజాగా ఇదే విషయంపై కొందరు నాయకులు కూడా.. పార్టీ చీఫ్ సోము వీర్రాజును కలిశారు. రాష్ట్రం లోని రెండు ప్రదాన పార్టీలు దూకుడుగా ముందుకుసాగుతున్నాయి. మరి మన సంగతి ఏంటి? అనివారు ప్రశ్నించారు. ఎందుకంటే.. అటు వైసీపీ అయినా.. ఇటు టీడీపీ అయినా.. నియోజకవర్గాల వారీగా.. సమీక్షలు చేస్తున్నాయి. నాయకులకు అలెర్టు చేస్తున్నారు.
కొందరికి ఇంపార్టెంట్ అనుకున్న వారికి టికెట్లు కూడా.. కన్ఫర్మ్ చేస్తున్నారు. అదేసమయంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి.. నాయకులు కలిసి కట్టుగా.. కదనరంగంలోకి దింపేలా వ్యూహాత్మకంగా వైసీపీ, టీడీపీలు అడుగులు వేస్తున్నాయి. దీంతో అంతో ఇంతో ఆయా పార్టీల్లో జోష్ కనిపిస్తోం ది. దీనిని పరిగణనలోకి తీసుకుంటున్న బీజేపీ నాయకులు.. వచ్చే ఎన్నికల నాటికి మనపరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎందుకంటే.. నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేయాలని కొందరు భావిస్తున్నారు. దీంతో సమీక్షలకు పట్టుబడుతున్నారు.
నిజానికి సోము వీర్రాజు కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఆయనకు కూడా.. పార్టీని బలోపేతం చేయాలనే ఉంది. కానీ, నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసేందుకు.. ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జులు లేకుండా పోయారు. దీంతో ఆయన ఈవిషయంలో సైలెంట్ అయిపోయారు. ఎక్కడ చూసుకున్నా.. నాయకుల కొరత పార్టీని వెంటాడుతోంది. పైకి ఎంతో గంభీరంగా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని.. చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో వెనుదిరిగి చూసుకుంటే మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
ఎక్కడా కూడా.. ఆశించిన స్థాయిలో నాయకులు లేరు. 175 నియోజకవర్గాల్లో పట్టుమని 60 మంది కూడా నాయకులు నికరంగా.. పార్టీకి కనిపించడం లేదు. పోనీ.. పార్టీలో నేతలు లేరా.. అంటే, ఉన్నారు. కానీ, వారంతా.. పోటీలో నిలిచి గెలిచే క్యాండెట్లు కారు. సో.. ఈ పరిణామాలతోనే.. నియోజకవర్గాల సమీక్ష కానీ, నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన కానీ.. బీజేపీ చేయడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీని ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on October 30, 2022 2:13 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…