మూడు రాజధానుల విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం కానీ, ఆ పార్టీ నాయకులు కానీ ప్రజలను ఏమేరకు ఒప్పిస్తున్నారో తెలియదు కానీ, వారిలో వారే వింత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల విశాఖ రాజధానికి మద్దతుగా గర్జన
నిర్వహించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా.. ‘వైసీపీ ఆత్మగౌరవ మహా ప్రదర్శన’ పేరుతో భారీ ర్యాలీకి రెడీ అయింది. అయితే, దీనిపై రాయల సీమలోని వైసీపీ నేతల్లో భిన్న వైఖరి వ్యక్తమైంది. దీనికి మద్ధతుగా కొందరు నిలిస్తే.. ఇలాంటి కార్యక్రమమే అవసరం లేదని మరికొందరు అంటున్నారు. దీంతో ఇది వైసీపీలోనే మంటలు రేపడం గమనార్హం.
విశాఖ గర్జన తరహాలో సీమ జిల్లాల్లో తొలిసారిగా తిరుపతిలో “రాయలసీమ ఆత్మగౌరవ ప్రదర్శన” పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి ఈ ప్రదర్శన తలపెట్టారు. అయితే.. దీనిపై స్పందించిన సీమ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం అలాంటివి అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, రాయలసీమకు పరిపాలనా రాజాధాని అవసరం లేదని.. న్యాయ రాజధాని సరిపోతుందన్నారు.
భారీ ఎత్తున ఫ్లెక్సీలు..
మరోవైపు తిరుపతిలో నిర్వహించే ర్యాలీకి భారీ ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు. ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోరుకొనే వారంతా చేతులు కలపండి’, ‘అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ నినాదాలతో రాయలసీమ పరిరరక్షణ సమితి, మానవవికాస వేదికలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు మూడు రాజధానులకు మద్ధతుగా ముద్రించిన కరపత్రాల పంపిణీ చేపట్టారు.
శ్రీబాగ్ ఒడంబడిక రాయలసీమకు రాజధాని ఆవశ్యకత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మూడు రాజధానులకు ప్రజలు మద్ధతు కూడగట్టడం ద్వారా వైసీపీ ప్రయోజనాలు కాపాడే లక్ష్యంగా మహాప్రదర్శన సాగనుంది. ప్రజలను చైతన్యం చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణకు మద్ధతు కూడగడతామని కరుణాకరరెడ్డి ప్రకటించారు.
మూడు రాజధానులకు మద్ధతుగా మహా ప్రదర్శనకు కరుణాకరెడ్డి సారథ్యం వహిస్తుంటే.. అలాంటి ప్రదర్శనలు అవసరమే లేదంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భిన్నంగా స్పందించడం ఇప్పుడు సీమలోని నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఒకే పార్టీకి చెందిన ప్రముఖ నేతలు భిన్నంగా స్పందించడం ఆపార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. తిరుపతి నగరవాసులతో మాత్రమే మహాప్రదర్శన అని ప్రకటించినప్పటికీ సీమ జిల్లాల నుంచి పలువురు ప్రముఖులు ర్యాలీలో పాల్గొననున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 29, 2022 5:30 pm
మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…