సాధారణంగా ఏ కుటుంబంలో అయినా.. పెళ్లియి అత్తవారి ఇంటికి వచ్చిన కోడలు ఇంట్లో పనులు చేసుకుంటుంది. దీనిని ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇదే విషయంపై ఒక కోడలు కోర్టుకు ఎక్కింది. ఇంటి పనులు చేయాలని తనను అత్తగారు పోరు పెడుపెడుతోందని.. ఇది క్రూరత్వమని పేర్కొంటూ బాంబే హైకోర్టులో కేసు వేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇది చాలా స్పెషల్ కేసు అని పేర్కొంది. అంతేకాదు ఇంట్లో పనులు కోడలు చేసుకోకపోతే ఎవరు చేస్తారని ప్రశ్నించింది. అసలు ఈ కేసు క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కోడలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
మహారాష్ట్రకు చెందిన ఓ కొత్త కోడలు.. పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు పని చేసేలా చూస్తున్నారని, ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని ఏకంగా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం..ఇరు పక్షాల వాదనలు విన్నది. అంతేకాదు అసలు ఇంట్లో ఏం జరుగుతోందో చెప్పాలని రికార్డులు తీసుకురావాలని కూడా కోరింది.
అనంతరం తాజాగా తీర్పు ఇచ్చింది. “ఒక వివాహిత అయిన కోడలును ఇంటి పని చేయమని చెప్పారంటే..అది కచ్చితంగా కుటుంబ అవసరానికై ఉంటుంది. అంతే తప్ప పని మనిషిలా చూస్తున్నారని చెప్పలేం. ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే..పెళ్లికి ముందే ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి. అప్పుడు వరుడి కుటుంబ సభ్యులు మరోసారి అలోచించుకునే వీలుంటుంది. పెళ్లికి ముందే ఇలాంటి సమస్యలను పరిష్కరించు కోవాలి” అని వ్యాఖ్యానించింది. తాజా కేసులో భార్య తన భర్త, అతడి తల్లిదండ్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ కేసును కొట్టివేసింది.
This post was last modified on October 29, 2022 12:06 pm
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…