Political News

అమ‌రావ‌తిలో పేద‌ల‌కు ఇళ్లు.. వైసీపీ స‌ర్కారు త‌గ్గేదేలే!

ఏపీలో వైసీపీ స‌ర్కారు త‌గ్గేదేలే! అనే విధంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. రాజధాని అమ‌రావ‌తి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేక జోను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ముసాయిదాలో వెల్లడించింది. రాజధాని పరిధిలో ఉన్న ఐదు గ్రామల్లో 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది.

ఇటీవల చేసిన సీఆర్డీఏ చట్ట సవరణ మేరకు ప్రత్యేకంగా ఈ జోన్ను ఏర్పాటు చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చింది. సీఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఆర్-5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. రాజధానిలోని 5 గ్రామాల పరిధిలోని 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేశారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఉంటుందని పేర్కొంది. అలాగే తూళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లోనూ ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు.

జోనింగ్లో మార్పు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేసేందుకు 15 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అక్టోబరు 28వ తేదీ నుంచి నవంబరు 11వ తేదీ వరకూ సీఆర్డీఏ కార్యాలయంలో కానీ, ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా అభ్యంతరాలు తెలియచేయవచ్చని తెలిపింది. మరోవైపు రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అనువుగా మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేసేందుకు స్థానిక సంస్థల పాలకవర్గాలకు, ప్రత్యేక అధికారులకు అధికారాలు కల్పిస్తూ.. ప్రభుత్వం ఇటీవలే సీఆర్డీఏ చట్ట సవరణ చేసింది. దానికి అనుగుణంగా ఈ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు.

వాస్త‌వానికి గ‌త ఏడాదే.. రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ‌ధానిలో భూములు కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ల‌బ్ధిదారుల‌ను కూడా ఎంపిక చేసింది. అయితే.. తాము రాజ‌ధాని కోసం ఇచ్చిన భూముల‌ను పేద‌ల‌కు ఇవ్వ‌డం ఏంట‌ని.. రాజ‌ధానిని ప‌క్క‌న ప‌డేయడం ఏంట‌ని రాజ‌ధాని రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నించిన కోర్టు అలా చేయ‌డానికి వీల్లేద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను మార్పు చేస్తూ.. స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌, ఇప్పుడు తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మ‌రి దీని పై రైతులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Share

Recent Posts

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

42 minutes ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

12 hours ago