Political News

టీడీపీ తో పొత్తు పై.. బీజేపీ గుస్సా.. ప‌వ‌న్‌కు సంక‌టం..?

తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఢిల్లీ వెళ్లారు. ఆయ‌న అక్క‌డ బీజేపీ పెద్ద‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు.. త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామాలు.. వంటివి చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ సారి కూడా.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతోనే.. ప‌వ‌న్ భేటీ అయి న‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా.. ప‌వ‌న్‌తో బీజేపీ నేత‌లు చేసిన చ‌ర్చల సారాంశం ఒక్క‌టే అంటున్నారు ప‌రిశీల‌కులు. అప్పుడే ఇత‌ర పార్టీలతో పొత్తులు వ‌ద్ద‌నే కీల‌క సూచ‌న చేసిన‌ట్టు స‌మాచారం.

నిజానికి.. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఓడిస్తాన‌ని.. ఆ పార్టీకి.. ప్ర‌భుత్వానికి బుద్ధి చెబుతాన‌ని.. పేర్కొంటూ.. ప‌వ‌న్ నేరుగా టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుతో చేతులు క‌లిపారు. ఈ ప‌రిణామం.. బీజేపీని ఉత్కంఠ‌కు గురి చేసింది. మ‌రీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నాయ‌కు ల‌కు కంటిపై కునుకు లేకుండా చేసింది. త‌మ‌కు క‌నీసం మాట కూడా చెప్ప‌కుండానే ప‌వ‌న్ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏంట‌నే విష‌యంపై.. చ‌ర్చ సాగింది. ఈ క్ర‌మంలోనే సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లి వ‌చ్చారు.

అయితే.. అక్క‌డ‌కూడా.. ఆయ‌న ప‌వ‌న్‌తో పొత్తులో ఉన్నామ‌ని.. కానీ, మ‌న‌కు చెప్పకుండానే వెళ్లి టీడీపీతో చేతులు క‌లిపారని.. వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. దీనిపై బీజేపీ కేంద్ర పెద్ద‌లు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. అంటే.. ప‌వ‌న్ టీడీపీతో చేతులు క‌ల‌పొచ్చా.. క‌ల‌ప‌కూడదా? అనే విష‌యంపై బీజేపీ పెద్ద‌లు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటే.. ప్ర‌జ‌ల్లో చుల‌క‌న భావం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని.. ఎన్నిక‌ల‌కు ఆరు మాసాల ముందు ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నించి.. అప్పుడు నిర్ణ‌యం తీసుకుంటే మేల‌నే రీతిలో బీజేపీ పెద్ద‌ల భావ‌న ఉంది.

దీంతో ప‌వ‌న్‌కు ఇప్పుడు సంక‌టం ఏర్ప‌డింది. నిజానికి ఆయ‌న ఈ నెల 30న పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం అవుతున్నారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ ఆఫీస్‌లో రెండు రోజుల పాటు జ‌రిగే.. కార్య‌క్ర‌మంలో కార్య‌క‌ర్త‌ల‌కు నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేయాల‌ని ప‌వ‌న్ భావించారు. అయితే.. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు .. కొన్ని కీల‌క విష‌యాల్లో చేసిన సూచ‌న‌ల‌తో ప‌వ‌న్ కు సంక‌ట ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ని అంటున్నారు. అంటే.. ఆయ‌న దూకుడు.. పెర‌గ‌క‌పోగా.. త‌గ్గుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల నుంచి స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Share
Show comments
Published by
Satya

Recent Posts

మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…

4 hours ago

అవతార్ నిప్పులను తక్కువంచనా వేయొద్దు

ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…

5 hours ago

మురారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే

ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…

6 hours ago

అమెరికాలో బిర్యానీ లవర్స్‌కు షాక్ తప్పదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…

7 hours ago

`వేమిరెడ్డి` వేడి.. వైసీపీని ద‌హిస్తుందా.. !

రాజ‌కీయంగా ప్ర‌శాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రినీ టార్గెట్ చేయ‌లేదు. త‌న స‌తీమ‌ణి,…

8 hours ago

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో ఏముంది?

తెలంగాణ‌లో సీఎం రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం.. స్వ‌ప్నిస్తున్న తెలంగాణ విజ‌న్ డాక్యుమెంటును తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ్యూచ‌ర్…

8 hours ago