టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా మొయినాబాద్ ఫామ్‌హౌస్ లో జరిగిన బేరసారాలకు కొన్ని రోజుల ముందు.. అసలు ఏం జరిగిందనే విషయాలకు సంబంధించిన ఆడియోలను అధికార టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామీజీ రామచంద్ర భారతి అలియాస్ సతీష్ చంద్ర, నందకుమార్ మధ్య జరిగిన సంభాషణల ఆడియోలు వైరల్‌గా మారాయి. ఇందులో రాజకీయ జీవితం, బేరసారాల గురించి సంభాషణ ఉంది. అయితే.. ఇది ఈ కేసు వెలుగు చూడడానికి ముందు చాలా రోజుల కిందటే జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. తాజాగా మొయినాబాద్ ఫామ్‌హౌస్ లో జరిగిన బేరసారాలకు కొన్ని రోజుల ముందు.. అసలు ఏం జరిగిందనే విషయాలకు సంబంధించిన ఆడియోలను అధికార టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, స్వామీజీ రామచంద్ర భారతి అలియాస్ సతీష్ చంద్ర, నందకుమార్ మధ్య జరిగిన సంభాషణల ఆడియోలు వైరల్‌గా మారాయి. ఇందులో రాజకీయ జీవితం, బేరసారాల గురించి సంభాషణ ఉంది. అయితే.. ఇది ఈ కేసు వెలుగు చూడడానికి ముందు చాలా రోజుల కిందటే జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఆడియోలో కీలక అంశాలు ఇవే…
స్వామిజీ: బీజేపీలోకి రావడానికి నేను క్లియర్ చేస్తాను. బీజేపీలో మొదటి , రెండు స్థానాల్లో ఉన్న వ్యక్తులతో నేను మాట్లాడిస్తాను. ఈడీ , సీబీఐ దాడులు జరగకుండా నేను చూసుకుంటాను.
రోహిత్ రెడ్డి: నాతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లో చర్చిద్దాం.
స్వామీజీ: హైదరాబాద్‌లో వద్దు.. అక్కడైతే.. ఏదైనా లొల్లి జరిగే అవకాశం ఉంది. అక్కడ కాకుండా వేరే రాష్ట్రంలో చర్చిద్దాము.
రోహిత్: అదేంలేదు. ప్రస్తుతం అందరూ మునుగోడు ఎలక్షన్‌లో బిజీగా ఉన్నారు ఎవరూ కూడా హైదరాబాద్‌లో లేరు. పోలీసులు, నాయకులు అందరూ కూడా మునుగోడులోనే మకాం వేశారు. హైదరాబాద్ సేఫ్ గా ఉంటుంది.
స్వామిజీ: అలా కాదు. హైదరాబాద్ కాకుండా దానికి సమీపంలో ఏదైనా ప్రాంతం చూడండి.
రోహిత్ రెడ్డి: నాతో పాటు వచ్చే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లను నెంబర్ 2 ముందు కూర్చున్నప్పుడు రివీల్ చేస్తాను.
స్వామీజీ: బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ జీ డిసైడ్ చేస్తారు. నెంబర్ 1, నెంబర్ 2 సంతోష్ ఇంటికే వస్తారు.
రోహిత్ రెడ్డి: నిజానికి ఈ ప్రెపోజల్ పెట్టింది నందూనే. ఆయనతోకలిసి వస్తాము. నాకు అన్ని రకాలుగా భద్రత ఉంటుందని చెప్పారు. రాజకీయంగా, ఇతరత్రా కూడా బాగుంటుందని చెప్పారు. నాకు హామీ కూడా ఇచ్చారు.
స్వామిజీ: ఔను. ఇది నిజం. ఈ విషయంలో మీరు ఎలాంటి తర్జన భర్జనా పడాల్సిన అవసరం లేదు. మీకు అండగా పెద్దలు ఉంటారు. ఇదే విషయాన్ని ముఖాముఖి కూడా చర్చించుకుందాం. ఈ విషయంలో ఇంకెలాంటి తేడా లేదు. ఫస్ట్ కమ్ ఫస్ట్ అనేదే ముఖ్యం. మీరు బాగా చదువుకున్న వారు. సమాజంపై మీకు అవగాహన ఉంది. అందుకే మీకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
రోహిత్‌రెడ్డి: ఔను. నాకు కూడా ఆసక్తి ఉంది. ప్రజలకు కూడా నా గురించి తెలుసు.
స్వామిజీ: ఔను. నాకు కూడా తెలుసు. ఈ విషయంలో ఇంక ఆలస్యం చేయడం సరికాదు. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇక, ముందుకు సాగడమే.
రోహిత్: నేను 24 న రెడీగా ఉంటాను.
స్వామీ జీ: కాదు కాదు.. ఆరోజు నేను ఢిల్లీలో ఉంటాను 25 అయితే బెటర్. ఆరోజు కూర్చుందాం. ఎన్నికలకు ముందుగానే మనం దీనినిపూర్తి చేయాలి. ఇది ఎన్నికల పై ప్రభావం చూపించాలి. రెండోది మన సెక్టార్‌లో మనకు మంచి నాయకుడు కూడా కావాలి. అందుకే..నందుపై కొంత ఒత్తిడి ఉంది. ఆయనకన్నా ఎక్కువగా నాపై ప్రజెర్ ఉంది. ఇప్పుడు మీరు మరో ముగ్గురి పేర్లు చెప్పగలరా?
రోహిత్: సంతోష్ జీ మెయిన్. మిగిలిన వారు కూడా రెడీగా ఉన్నారు. సంతోష్‌పై పూర్తి బాధ్యత ఉంటుంది. ఆయనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ.. ఇతరత్రా చేయాల్సిన అవసరం ఉంది.
అంటూ ఇరువురి మధ్య జరిగిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…