Political News

వైసీపీ ఓటు బ్యాంకు పై జ‌న‌సేన క‌న్ను..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఎన్ని ఓట్లు వ‌స్తాయి.? అనేది ఆస‌క్తిగా మారింది. ఇప్పుడు టీడీపీతో చేతులు క‌లిపిన ద‌రిమిలా.. ఈ చ‌ర్చ మ‌రింత ఎక్కువ‌గా సాగుతోంది. ప్ర‌స్తుతం వ‌చ్చే ఎన్నిక‌ల‌ పై దృష్టి పెట్టిన జ‌న‌సేన‌.. జిల్లాల వారీగా.. ఓటు బ్యాంకు పై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలో ఉభ‌య‌గోదావ‌రి, విశాఖ‌, అనంత‌పురం, క‌ర్నూలు, చిత్తూరు, ఉత్త‌రాంధ్ర‌ జిల్లాల‌పై పెద్ద‌గానే ఆశ‌లు పెట్టుకుంది. ఈ జిల్లాల్లో దూకుడు ప్ర‌ద‌ర్శించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం 10 నుంచి 15 సీట్ల‌యినా.. గ‌ట్టిగా సాధించాల‌నేది అంత‌ర్గ‌త నిర్ణ‌యం.

అయితే.. ఆయా జిల్లాల్లో ఎవ‌రి ఓట్లు జ‌న‌సేన‌కు అనుకూలంగా ఉన్నాయి.? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే..సంస్థాగ‌తంగా జ‌న‌సేన‌కు ఓట్లు లేవు. 2014 లో పోటీకి దూరంగా ఉంది. 2019లో పోటీ చేసినా.. టీడీపీ ఓట్లు చీలాయ‌నే అభిప్రాయం ఉంది. అప్ప‌ట్లో వ‌చ్చిన ఓట్ల‌న్నీ కూడా.. టీడీపీకి ప‌డాల్సిన‌వేన‌ని.. అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు న‌ర‌సాపురంలో పార్ల‌మెంటు స్థానానికి జ‌న‌సేన పోటీ చేసింది. ఇక్క‌డ నాగ‌బాబు కు వ‌చ్చిన ఓట్ల‌న్నీ..కూడా టీడీపీకి ప‌డాల్సిన ఓట్లేన‌ని ఒక లెక్క ఉంది.

దీంతో ఓట్లు చీలిపోయి.. టీడీపీ ప‌రాజ‌యం పాలైంది. ఇక‌, రాజోలు లోనూ ఇదే ప‌రిస్థితి ఎద‌రైంది. ఇక్క‌డ జ‌న‌సేన గెలిచింది. కానీ, ఓట్లు మాత్రం టీడీపీవ‌నే అంచ‌నా వుంది. అంటే.. 2019లో టీడీపీ ఓట్ల‌నే జ‌న‌సేన త‌న ఖాతాలో వేసుకుంది. ఫ‌లితంగా.. ఓట్లు రాక టీడీపీ ఇబ్బంది ప‌డింది. గెలుస్తామ‌ని అనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ప‌రాజ‌యం పాలైంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓటు చీలి.. అది త‌న‌కు ప‌డేలా ప్లాన్ చేస్తున్నార‌ట జ‌న‌సేనాని. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్న నేప‌థ్యంలో ఇది మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని అంటున్నారు.

అయితే.. ఇది ఎంత వ‌ర‌కు సాధ్య‌మ‌వుతుంది? అనేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికిప్పుడు ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. వైసీపీ ఓటు బ్యాంకు ముఖ్యంగా మ‌హిళా ఓటు చీలే అవ‌కాశం లేదు. గ‌తంలో వైసీపీకి ఓటేసిన మ‌హిళల కు ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుతోంది. దీంతో వారంతా మ‌ళ్లీ వైసీపీకే ఓటేయ‌నున్నారు. ఎటొచ్చీ.. మ‌రోసారి టీడీపీ ఓటు బ్యాంకుకే జ‌న‌సేన ఎస‌రు పెడుతోంద‌నే అభిప్రాయం టీడీపీ నేత‌ల్లో ఉంది. దీని నుంచి ఎలా బ‌య‌ట‌కు రావాల‌నే విష‌యంపైనే నాయ‌కులు దృష్టి పెట్టార‌ట‌. అంటే.. టీడీపీ ఓటు బ్యాంకు.. చెద‌ర‌కుండా.. జ‌న‌సేన గెలుపు గుర్రం ఎక్కాలంటే.. ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 27, 2022 7:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago