Political News

భ‌క్తుల‌కు ‘మంత్రి’ గ్ర‌హణం!!

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అనుచ‌రులు వేసిన వీరంగంతో.. భ‌క్తులు నానా తిప్పలు ప‌డ్డారు. అందునా.. సూర్య‌గ్ర‌హ‌ణం రోజు ఎంతో ఆశ పెట్టుకుని శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యానికి వ‌చ్చిన వంద‌ల మంది భ‌క్తులు.. మంత్రి అనుచ‌రులు చేసిన‌.. అరాచ‌కంతో.. ఇబ్బందులు ప‌డ‌డమే కాకుండా.. తీవ్ర మ‌నోవేద‌న‌కుకూడా.. గుర‌య్యారు. “ఎంత మంత్రి అయితే.. మాత్రం .. అని మండిప‌డుతున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. మంగ‌ళ‌వారం.. సూర్య‌గ్ర‌హ‌ణం అన్న సంగ‌తి తెలిసిందే. దీనిని పుర‌స్క‌రించుకుని.. రాష్ట్రంలో దాదాపు అన్ని ఆల‌యాలు.. మూసివేశారు. అయితే.. ఒక్క శ్రీకాల‌హ‌స్తిలో మాత్రం..గ్ర‌హ‌ణ స‌మ‌యంలోనూ.. ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు. ఎందుకంటే.. గ్ర‌హాల‌కు అధిప‌తి అయినా.. శివ‌య్య‌ను..ముఖ్యంగా శ్రీకాళ‌హ‌స్తీశ్వ‌రుని పూజించ‌డం ద్వారా.. త‌మ జీవితంలో ఎదుర‌వుతున్న గ్ర‌హ దోషాల‌ను తొల‌గించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో మంగ‌ళ‌వారం.. రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి భ‌క్తులు.. శ్రీకాళ‌హ‌స్తికి వ‌చ్చారు. అయితే.. అదేస‌మ‌యంలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి త‌న స‌తీమ‌ణి.. కొడుకులు, కోడ‌ళ్లు.. మ‌న‌వ‌లు, ఇత‌ర బంధువుల‌తో వ‌చ్చారు.

దీంతో ఆయ‌న‌కు ఆల‌య అధికారులు స‌హా.. స్థానిక ఎమ్మెల్యే.. బుయ్య‌పు మ‌ధుసూద‌న రెడ్డి..రెడ్ కార్పెట్ ప‌రిచి మ‌రీ.. స్వాగ‌తాలు ప‌లికారు. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. కానీ, అదే స‌మ‌యంలో పెద్దిరెడ్డి అనుచ‌రులు. క్యూలైన్ల‌లో ఉన్న భ‌క్తుల‌నుఇబ్బంది పెట్ట‌డ‌మే ఇప్పుడు వివాదానికి దారితీసింది. మంత్రి కుటుంబీకులను అమ్మవారి అభిషేకానికి తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు నానా బీభత్సం సృష్టించారు. భక్తులను పక్కకు జరుపుతున్న క్రమంలో.. పెద్ద ఎత్తున తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులపై తిరగబడ్డారు.

వైసీపీ నేతలు, పోలీసులు కలిసి వారిని తోసేయడంతో మరింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనిపై పలువురు భక్తులు వాగ్వాదానికి దిగడం, దీంతో పరస్పరం వాదులాడుకోవడంతో.. సామాన్య భక్తుల పరిస్థితి దయనీయంగా మారింది. పెద్దిరెడ్డి కుటుంబీకులు, వీవీఐపీల అభిషేకం పూర్తయ్యే వరకు సామాన్య భక్తులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. దీనివెనుక పెద్దిరెడ్డి శిష్యుడు.. శ్రీకాళ‌హ‌స్తి.. ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి ఉన్నార‌నే ప్రచారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో గ్ర‌హ‌ణ స‌మ‌యంలో పూజ‌లు చేయించుకుని.. క‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని వ‌చ్చిన భ‌క్తుల‌కు.. కొత్త క‌ష్టాలు రావ‌డం.. చోద్యంగా మారింది.

This post was last modified on October 26, 2022 1:37 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

1 hour ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

2 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

5 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

7 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

8 hours ago