బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రుషి సునాక్ కు చాలా సవాళ్ళు ఎదురుకానున్నాయి. అన్నింటిలోను అతిపెద్ద సవాలు ఏమిటంటే దేశంలో ఆర్థిక స్థిరత్వం సాధించటం. ఎందుకంటే ఆర్ధిక సమస్యల నుండి దేశాన్ని గట్టెక్కించటంలో మాజీ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ వేసిన ప్రణాళికలు ఫెయిలైన విషయం తెలిసిందే. తన ప్లాన్లు ఫెయిలైన కారణంగానే ట్రస్ కేవలం 45 రోజుల్లోనే పదవి నుంచి దిగిపోయారు.
ఇక్కడ సునాక్ ముందున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే రాబోయే ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని ఆదుకోవటమే. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే ఆందోళన పెరిగిపోతోంది. ఆర్థికమాంద్యం ఆందోళన చాలాదేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే పదులసంఖ్యలో అతిపెద్ద కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఇదేదారిలో ఇంకా చాలాకంపెనీలు నిర్ణయాలు తీసుకోబోతున్నాయి. ఈ కారణంగా నిరుద్యోగం పెరిగిపోతోంది.
సో ఆర్ధికమాంధ్యం, నిరుద్యోగం కారణంగా సమాజంపై పడే ప్రభావం అన్నీ ఒకదానితో మరొకటి లింకులున్న అంశాలు. గతంలో ఒకసారి ఆర్ధికమాంధ్యం ఎదురైనపుడు చాలా దేశాలు కుప్పకూలిపోయాయి. ఇపుడు కూడా అలాంటి ప్రమాదాన్నే ప్రపంచం అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే కొన్నిదేశాల్లో మాంధ్యం ముప్పు ప్రభావం కనబడుతోందని నిపుణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. సునాక్ తీసుకోబోయే ప్రతి నిర్ణయమూ బ్రిటన్ భవిష్యత్తును నిర్ణయిస్తాయనటంలో సందేహంలేదు.
అందుకనే ప్రధాని బాధ్యతలు సునాక్ కు అంత తేలిక కాదు. దేశంలో ఆర్థిక స్థిరత్వం సాధించడమే తన ముందున్న అతిపెద్ద ప్రాధాన్యతగా సునాక్ చెప్పారు. గతంలో ఎదురైన మాంధ్యం కారణంగా అప్పట్లో చాలాదేశాలతో పాటు బ్రిటన్ కూడా బాగా ఇబ్బందిపడింది. అలాంటి ముప్పే తొందరలోనే ప్రపంచాన్ని ముంచేయబోతున్నట్లు సూచనలు కనబడుతున్న సమయంలో సునాక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. నిజానికి మనదగ్గర తీసుకున్నట్లు ఏకవ్యక్తి నిర్ణయాలు బ్రిటన్లో చెల్లుబాటు కావు. ముందు సలహాదారులు అంగీకరించాలి, తర్వాత పార్లమెంటు ఆమోదించాలి, అంతిమంగా రాజముద్ర పడాలి. తన ప్రయత్నాల్లో సునాక్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.
This post was last modified on October 25, 2022 4:54 pm
జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా…
ఏపీలో అధికార కూటమి మిత్ర పక్షాల మధ్య వక్ఫ్ బిల్లు వ్యవహారం.. తేలిపోయింది. నిన్న మొన్నటి వరకు దీనిపై నిర్ణయాన్ని…
హెడ్డింగ్ చూసి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భార్య వార్దా ఖాన్ వరస చూస్తే మీకూ…
టాలీవుడ్ కే కాదు మొత్తం భారతదేశ సినీ పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ ఇప్పటికే…
మచిలీపట్నం మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణరావు.. తన యాక్టివిటీని తగ్గించారు. ఆయన పార్టీలో ఒకప్పుడు యాక్టివ్…
టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో…