రాజకీయాల్లో ఇప్పుడు నెటిజన్ల ప్రాధాన్యం కూడా పెరిగిపోయింది. సమకాలీన రాజకీయాలపై నెటిజన్లు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ వాడకం.. డేటా వినియోగం పెరిగిపోయిన దరి మిలా.. నెటిజన్లు.. ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలపైనా.. వారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీకి చివరకు మిగిలేది.. ఇదే.. అంటూ.. కామెంట్లు కుమ్మరిస్తున్నారు. గత అనుభవాలను కూడా వారు వివరిస్తున్నారు. ఎప్పుడూ.. ఒకవైపే చూడకు జగనన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం సంక్షేమ కార్యక్రమాలను జోరుగా అమలు చేస్తున్నామని..తమకు తిరుగులేదని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదే తమకు మేలు చేస్తుందని అంటున్నారు. అయితే.. దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నెటిజన్లు ఏమంటున్నారం టే.. సంక్షేమం పనిచేయడం కష్టమేనని చెబుతున్నారు. ఎందుకంటే.. జనాల మూడ్.. ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టమని అంటున్నారు.
దీనికి వారు.. 2009 ఎన్నికలను ఉదాహరణగా పేర్కొంటున్నారు. అప్పటి ఎన్నికల్లోఅనేక సంక్షేమ కార్యక్ర మాలు తీసుకువచ్చారు. అయినా.. కూడా ఆశించిన మేరకు ఫలితం రాలేదు. పైగా.. కాంగ్రెస్ సీట్లు తగ్గిపో యి.. ప్రతిపక్షాలకు సీట్లు పెరిగాయి. అంతేకాదు.. అనుకున్న రేంజ్‌లో కాంగ్రెస్‌కు సీట్లు రాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిని ఏపీలోనూ అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సంక్షేమం కొంత వరకే పనిచేస్తుం దని.. ప్రజలు అభివృద్ధి వైపు తిరిగితే ఫలితం వేరేగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచైనా.. అభివృద్ది వైపు దృష్టి పెట్టాలని అంటున్నారు. ఎన్నికలు అంటే.. కేవ లం సంక్షేమం తీసుకున్నవారే కాకుండా.. సంక్షేమం దక్కనివారు కూడా.. ఉంటారని..వారిని మెప్పించేలా కూడా.. అడుగులు ముందుకు వేయాలని చెబుతున్నారు. మరి నెటిజన్ల టాక్‌పై వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కానీ.. ఇప్పటి వరకు వైసీపీ తన పంథాలోనే సాగుతూ.. పిడివాదమే వినిపిస్తోంది. ఎవరైనా సూచనలు చేసినా.. సలహాలు ఇచ్చినా స్వీకరించే పనిలో మాత్రం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా సూచనలు ఏమేరకు ఫిలిస్తాయో చూడాలి.
This post was last modified on October 24, 2022 11:03 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…