వైసీపీ అంటే.. అప్రకటిత క్రమ శిక్షణకు పెట్టింది పేరు. పైకి అంతా సాధారణంగా ఉంటుంది. కానీ.. అధినేత అంటే.. అపరిమితమైన గౌరవం.. ఆ మాటున భయం కూడా ఉంది. పైకి మీడియా ముందుకు వచ్చి.. ఎన్ని మాట్లాడినా.. అధినేత ముందుకు వెళ్లే సరికిమాత్రం చేతులు కట్టుకుని.. నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితి! దీనిపై గతంలోనే అనేక వివాదాలు.. వచ్చాయి. సీనియర్ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో ఇదే విషయాన్ని చెప్పారు. “జగన్ వయసు ఎంతండి. మా ఇంటికి వచ్చి.. అన్నీ పాడుచేసేవాడు. ఇప్పుడు నేను ఆయన ముందు నిలబడాల్న.. చేతులు కట్టుకోవాల్నా?” అంటూ.. ఆయన రుస రుసలాడిన వీడియో.. అప్పట్లో జోరుగా వైరల్ అయింది.
అలాంటి అత్యంత క్రమ శిక్షణ ఉన్న పార్టీలో ఇప్పుడు నేతలు.. దారి తప్పేస్తున్నారు. అధినేత జగన్‌పై అపార గౌరవం కాస్తా.. కనీస గౌరవంగా మారిపోతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం. పార్టీ అదినేత చేస్తున్న పనులు.. తీసుకుంటున్న నిర్ణయాలే కారణంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ప్రభుత్వం కానీ… సీఎం జగన్ కానీ.. తీసుకుంటున్న నిర్ణయాలు.. ఇటీవల కాలంలో తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. గడపగడపకు కార్యక్రమానికి వెళ్తే.. ప్రజలు సమస్యల చిట్టాలను విప్పుతున్నారు. ఇక, ఎక్కడ ప్రసంగించినా.. రాష్ట్ర సమస్యలు కనిపిస్తున్నాయి. వాటిని ప్రస్తావించకుండా.. మాట్లాడలేని పరిస్థితి.
ఇవి ఇలా.. ఉంటే.. ప్రజలకు సెంటిమెంటుగా మారిన కొన్ని అంశాలపైనా.. ప్రభుత్వం తీవ్ర వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో నాయకులు సమాధానం చెప్పుకోలేక పోతున్నారు. ఇప్పుడు.. అంతర్గత సంభాషణల్లో.. సీఎం జగన్ వ్యవహారంపై.. వైసీపీ నాయకులే.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మార్పు మంచిదే అయినా.. పరాయి.. వ్యక్తుల జోలికి పోవడం.. ప్రజల్లో సెంటిమెంటుగా ఉన్న అంశాలను కెలకడం ఎందుకని.. వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు చేయొచ్చని.. కానీ.. అవి కొంతవరకు ఉండాలని.. నాయకులు సూచిస్తున్నారు.
“మా అధినేత చేస్తున్న పనులతో మేం తల ఎత్తుకోలేక పోతున్నాం. మా ఖర్మ.. మరో అవకాశం లేదు” అని.. సీమ ప్రాంతానికే చెందిన ఒక నాయకుడు.. వ్యాఖ్యానించారు. ఈయన ఒక్కరే కాదు.. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు.. కొన్ని నిర్ణయాలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిని తప్పు.. అని చెప్పలేం. కానీ.. తప్పే..! మనకు ఎందుకు? అనేక సంస్థలు ఉన్నాయి.. వాటి పేరు మార్చి పెట్టుకోవచ్చు కదా! అని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా పరిణామాలపైనా.. కొందరు పెదవి విరుస్తున్నారు. “మన నాయకులే బూతులు మాట్లాడారు. అప్పుడు కంట్రోల్ చేసుకుని ఉంటే గౌరవంగా ఉండి” అని కొందరు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తీరు ముందు ముందు పెరిగితే.. పార్టీపై గౌరవం సన్నగిల్లడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 22, 2022 10:20 am
దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయని పని..…
అతడులో తనికెళ్ళ భరణి చెప్పే ఫేమస్ డైలాగు ఒకటుంది. బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు. బాలీవుడ్…
ఇప్పటి మన జీవిత విధానం చాలా వేగంగా మారిపోయింది. ఏదైనా తినాలనిపిస్తే కేవలం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. కొన్ని…
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…