Political News

వైసీపీ నిరంకుశ ధోర‌ణికి బుద్ధి చెప్పండి: బాల‌య్య‌

సాధార‌ణంగా ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేవు. అందునా.. ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగేందుకు మరో ఏడాదిన్న‌ర‌ పైగానే స‌మ‌యం ఉంది. అయితే.. ఇప్పుడే.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, అన్న‌గారి కుమారుడు.. నంద‌మూరి బాల‌కృష్ణ రంగంలోకి దిగారు. వైసీపీ ప్ర‌భుత్వ నిరంకుశ ధోర‌ణికి బుద్ధి చెప్పాల‌ని.. ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు మాత్ర‌మే కాదు.. మేధావులు, విద్యావంతుల‌కు కూడా పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న సెల్పీ వీడియోను తీసుకుని.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీనికి కార‌ణం.. త్వ‌ర‌లోనే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసే.. వారిని గెలిపించాల‌ని బాల‌య్య పిలుపునిచ్చారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి‌ని గెలిపించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపు నిచ్చారు. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో టీడీపీ తరుపున రాంగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఉన్నత విద్యావంతుడైన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. పట్టబద్రులంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశధోరణి అవలంభిస్తుందని బాలకృష్ణ ఆరోపించారు. ఆ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పేందుకు.. ఇదే తొలి అవ‌కాశ‌మ‌ని బాల‌య్య తెలిపారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించి ఓటేయాల‌ని అన్నారు.

అదేస‌మ‌యంలో త‌మ ఓట్ల‌ను రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని.. గ్రాడ్యుయేట్ల‌కు .. బాల‌య్య సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ ఓటు వేయ‌డం ద్వారా.. ఓటు ద్వారా.. వైసీపీకి బుద్ధి చెప్పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. మొద‌టి ప్రాధాన్య‌తా ఓటును భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి వేయాల‌ని సూచించారు. ఆయ‌న పార్టీలో సుదీర్ఘ‌కాలంగా ప‌నిచేస్తున్నార‌ని.. క్ర‌మ‌శిక్ష‌ణా సంఘంలో బాధ్య‌లు నిర్వ‌హిస్తున్నార‌ని.. మేధావి అని.. పేర్కొన్నారు. ఆయ‌న‌ను గెలిపించుకోవ‌డం.. ద్వారా.. ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్పాల‌ని.. బాల‌య్య పిలుపునిచ్చారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు.. ఏ ఎన్నిక‌లోనూ.. బాల‌య్య ఇలా పిలుపునివ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. తాజాగా సెల్పవీడియో విడుద‌ల చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

This post was last modified on October 21, 2022 7:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

28 minutes ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

37 minutes ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

52 minutes ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

1 hour ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

1 hour ago

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

1 hour ago