రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని.. వైసీపీ అధికారంలోకి వచ్చి.. మూడేళ్లు దాటిపోయినా.. ఓ పదికిలోమీటర్ల మేరైనా.. రహదారులు నిర్మించ లేదని.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు.. కనీసం.. దెబ్బతిన్న రోడ్లను కూడా.. బాగుచేయలేకపోతున్నారని విమర్శలు చేస్తున్నాయి. అయితే.. వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా.. కొందరు మంత్రులు ప్రతిపక్షాలపై ఎదురు దాడి చేస్తున్నారే తప్ప.. రహదారుల దుస్థితిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వర్షాలకు.. అనేక ప్రాంతాల్లోరోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయినా.. పట్టించుకోలేదు.
రోడ్లపైనిలువెత్తు గుంతలు పడి.. చెరువులను తలపిస్తున్నాయని ప్రతిపక్షాలు.. ఫొటోలు వీడియోలతో సహా.. విమర్శలు చేస్తున్నా.. సర్కారు పట్టించు కోవడం లేదు. జనసేన, టీడీపీ నేతలు.. ఆయా గుంతల్లో స్నానాలు చేసి.. చేపలు పట్టి వినూత్న రీతిలో నిరసనలు తెలిపినా.. సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సొంత పార్టీ నాయకుడు.. జగన్ అంటే.. ప్రాణం పెట్టే నేత, విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే(ఇటీవల మూడు రాజధానులకు అనుకూలంగా రాజీనామా చేశారు) కరణం ధర్మశ్రీ.. రోడ్ల దుస్థితిపై విరుచుకుపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వంపై ఈగ కూడా వాలనివ్వని.. నేతల్లో ధర్మశ్రీ ముందు వరుసలో ఉంటారు. అసెంబ్లీలో సీఎం జగన్‌పై పద్యాలు.. పాడుతూ.. కవితలు చెబుతూ.. పొగడడంతో ఆయనకు ఆయనే సాటి. అలాంటి నాయకుడు.. తాజాగా ఓ ఫోన్‌లో మాట్లాడుతూ.. సర్కారు తీరుపై విమర్శలు చేశారు. బూతులు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్‌పై విరుచుకుపడ్డారు. తనను ప్రజలు ఆపేశారని.. మట్టి రోడ్లు వేస్తే.. ఎవరికి ప్రయోజనం’అని.. వాడు(సీఎం కావొచ్చు) డబ్బులు ఇవ్వట్లేదని.. వీళ్లని(ప్రజలను) ఇబ్బంది పెడితే.. మాకు తడిచిపోతోంది! అని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. రాష్ట్రంలో రహదారులపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా.. జగన్ వింటారో లేదో చూడాలి.
This post was last modified on October 21, 2022 6:37 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…