Political News

అప్పుడు బాబు ఇరుక్కున్నట్లే ఇప్పుడు జగన్?

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఇరుకున పెట్టిన అంశాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన అంశం.. ప్రత్యేక హోదా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొంత కాలం పాటు ప్రత్యేక హోదా డిమాండ్‌ను గట్టిగా వినిపించిన బాబు.. అది సాధ్యం కాదని మోడీ సర్కారు తేల్చేయడంతో, దాని స్థానంలో అంతే ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మీడియా వాళ్లు, జనాలు అడిగితే తూచ్ అనేశారు. గద్దించారు. కట్ చేస్తే జగన్ ప్రత్యేక హోదాను ఎన్నికల అంశంగా మార్చి దాని విషయంలో చంద్రబాబు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేశారు. ఎన్నికలు దగ్గరపడేసరికి బాబు యుటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. 

ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి మోడీ సర్కారు మీద యుద్ధం ప్రకటించారు. మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను ఎత్తుకుని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. ఐతే ఈ యుటర్న్ వల్ల బాబు క్రెడిబిలిటీ బాగా దెబ్బ తింది. పైగా సాధ్యం కాని హోదా డిమాండ్‌ను నెత్తికెత్తుకుని.. తనకు తాను చాలా డ్యామేజ్ చేసుకున్నారు. హోదా సాధించలేని విఫలవ్యక్తిగా ఎన్నికలకు వెళ్లారు. తర్వాత ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిందే.

ఐతే అప్పుడు ప్రత్యేక హోదా తాలూకు చిక్కుముడిలో పడి చంద్రబాబు ఎలా దెబ్బ తిన్నాడో ఇప్పుడు వైఎస్ జగన్ వికేంద్రీకరణ-మూడు రాజధానులు అనే అంశాన్ని నెత్తికెత్తుకుని దెబ్బ తినబోతున్నాడనే అభిప్రాయాల్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. ఆ తర్వాత యుటర్న్ తీసుకుని, దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం.. మూడేళ్లుగా దీని మీదే రాజకీయం చేస్తూ ఇటు అమరావతిలో, అటు విశాఖలో ఏమీ చేయకుండా ఉండిపోవడం, ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు రేగేలా ఈ అంశాన్ని మరింత రాజకీయం చేస్తుండటం జగన్ సర్కారుకు డ్యామేజ్ చేసేలాగే కనిపిస్తోంది. 

ఎండ్ ఆఫ్ ద డే జనాలు చూసేది ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అసలేం సాధించింది, ఏం అభివృద్ధి చేసిందని. అమరావతికి సంబంధించి గత ప్రభుత్వం వీలైనంత మేర అభివృద్ధి చేసినా.. చివరికి అప్రతిష్ట పాలైంది. అలాంటిది జగన్ ప్రభుత్వ హయాంలో అక్కడ అభివృద్ధి ఆగిపోగా.. కొత్త రాజధానులుగా ప్రకటించిన విశాఖపట్నం, కర్నూలుల్లో కొత్తగా ఒక్క ఇటుక కూడా పడే పరిస్థితి కనిపించడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఎవరు పోల్ పెట్టినా రాజధానిగా అమరావతి వైపే మొగ్గు ఉంటోంది. మూడు రాజధానులకు ఓటస్తున్న వాళ్లు తక్కువ. విశాఖ గర్జన లాంటి కార్యక్రమాలకు బలవంతంగా జనాలను తరలించి హడావుడి చేశారే తప్ప.. నిజంగా విశాఖను రాజధానిని చేసే విషయంలో అక్కడి వారిలో అనుకున్నంత సానుకూలత కనిపించట్లేదనిపిస్తోంది.

ఇటీవల వెలుగు చూసిన భూ దందాలను చూస్తుంటే స్వార్త ప్రయోజనాల కోసమే విశాఖను రాజధానిగా ఎంచుకున్నారనే అభిప్రాయం బలపడుతోంది. మొత్తంగా చూస్తే మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర స్థాయిలో సానుకూల స్పందన లేదని తెలిసినా.. ఆ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి అలాగే ఎన్నికలకు వెళ్లాలని జగన్ అండ్ కో భావిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి గత పర్యాయం బాబును ప్రత్యేక హోదా అంశం దెబ్బ కొట్టినట్లే.. మూడు రాజధానుల అంశం జగన్‌కు ఝలక్ ఇస్తుందేమో చూడాలి.

This post was last modified on October 20, 2022 11:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

8 mins ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

31 mins ago

రెహమాన్ పై రూమర్స్.. బాధతో తనయుడి వివరణ

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…

32 mins ago

పీపీపీపీ.. స‌క్సెస్ అయితే బాబు బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్టే .. !

ఇప్ప‌టి వ‌ర‌కు పీపీపీ మోడ‌ల్ గురించే ప్ర‌జ‌ల‌కు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…

33 mins ago

నాగచైతన్య.. గ్రాఫిక్స్ కోసమే 30 కోట్లా?

యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…

1 hour ago

ఇంచార్జ్‌ల‌ను మార్చినా వైసీపీకి ఊపులేదు

ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో చావు దెబ్బ‌తిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా…

2 hours ago