వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలో రెచ్చిపోయాడు జనసేనాని పవన్ కళ్యాన్ ఈ రోజు. పవన్‌లో ఇంత ఆవేశం ఉందా అనిపించేలా తీవ్ర స్థాయిలో అధికార పార్టీ నాయకులను దునుమాడేశాడు. అలా అని ప్రజారాజ్యం టైంలో మాదిరి విషయం లేకుండా కేవలం ఆవేశాన్ని మాత్రమే ప్రదర్శించలేదు. పాయింట్ టు పాయింట్ పట్టుకుని వైసీపీ నేతల్ని టార్గెట్ చేశాడు. తనను ప్యాకేజీ స్టార్ అనే వాళ్లకు పవన్ ఈ రోజు దీటైన సమాధానమే చెప్పాడు. చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చాడు.
ఇక తన మీద తరచుగా మూడు పెళ్ళిళ్ళ విషయంలో వైసీపీ నేతలు చేసే విమర్శలను కూడా గట్టిగా తిప్పికొట్టాడు పవన్. తాను లీగల్‌గా విడాకులతో పాటు భరణం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకేంటి నొప్పి అని పవన్ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా విడాకులు తీసుకున్నాక తన తొలి ఇద్దరు భార్యలకు ఏం ఇచ్చింది కూడా పవన్ వెల్లడించాడు.
“మాటక ముందు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటారు. మీరూ చేసుకోండ్రా ఎవరు కాదన్నారు. మీకు కూడా మీ భార్యతో కుదరకపోతే విడాకులు ఇచ్చి ఇంకో పెళ్ళి చేసుకోండి. నేను నా మొదటి భార్యకు భరణం కింద ఐదు కోట్ల భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నా. రెండో భార్యకు విడాకులిచ్చాక ఆస్తి రాసిచ్చా. ఆ తర్వాత మూడో పెళ్లి చేసుకున్నా. నేను విడాకులిచ్చి పెళ్లి చేసుకున్నారా సన్నాసుల్లారా. ఒక్కర్ని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసుల్లారా మీకేంట్రా నేను చెప్పేది. ఎదవల్లారా” అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు పవన్.
మరోవైపు ప్యాకేజీ స్టార్ అనడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ పవన్.. తన ఆదాయం లెక్కలు కూడా చెప్పారు. గత 8 ఏళ్లలో తాను ఆరు సినిమాలు చేశానని.. వాటి ద్వారా 100-120 కోట్ల దాకా ఆదాయం వచ్చిందని.. అందులోంచి రూ.33 కోట్లకు పైగా ట్యాక్స్ కట్టానని.. రూ.12 కోట్లు పార్టీకి ఇచ్చానని పవన్ తెలిపాడు.
This post was last modified on October 18, 2022 4:49 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…