త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలో పర్యటించనున్నారు. అందునా ఆయన తొలిసభ విశాఖ లేదా విజయనగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితి(టీఆర్ఎస్)ని భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్)గా మార్చిన దరిమిలా.. ఆయన ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే.. త్వరలోనే ఏపీతో ప్రారంభించి.. దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నట్టు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏపీపైనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అయితే.. ఏపీకి రావడం అయితే తేలికే.. కానీ, ఇక్కడ ఏం చెబుతారు? ఆయన వ్యూహాలు ఏంటి? అనేదే ఇప్పుడు చర్చకు వస్తున్న విషయాలు.
ప్రస్తుతం ఏపీలో అనేక అనేక సమస్యలు తిష్టవేశాయి. రాజధాని అమరావతి సహా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ.. జల వివాదాలు, ఉద్యోగ నియామకాలు.. ఒకటా రెండా అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. మరి వీటిని ప్రస్తావించకుండా.. కేసీఆర్ ఏం చెప్పినా.. ప్రయోజనం లేదనేది స్థానిక రాజకీయ నేత లమాట. పైగా.. తెలంగాణ నుంచి అనే క వివాదాలు పరిష్కారం కావాల్సి ఉంది. వీటిపైనా.. సీఎం కేసీఆర్ ప్రస్తావన చేయాలి. అదేసమయంలో వెనుక బడిన జిల్లాలు, పోలవరం ముంపు ప్రాంత మండలాలు.. వంటివి సమస్యలకు కేంద్రంగా ఉన్నాయి. వీటిపైనా ఆయన స్పందన తెలియ జేయాలి. జాతీయ నేతగా ఆయన వచ్చి.. రెండు మాటలు చెప్పి వెళ్లిపోతే.. ఇక్కడి ప్రజలు మెచ్చుకునే పరిస్థితి ఎంత మాత్రం లేదు.
మరీ ముఖ్యంగా ప్రస్తుతం కీలకమైన మూడు రాజధానుల విషయంపై కేసీఆర్ వ్యూహాన్ని కూడా వెల్లడించాల్సి ఉంటుంది. రాష్ట్ర పరిదిలోని అంశమే అయినా.. ఆయనకు ఓట్లు కావాలన్నా.. ప్రజల నుంచి జేజేలు కావాలన్నా.. తన అభిప్రాయాన్ని చెప్పితీరాల్సిన అవసరం ఉంది. ఇక, జాతీయ పార్టీగా రాష్ట్రానికి ఏం చేస్తారో కూడా కేసీఆర్ వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రగతి భవన్ వర్గాలు.. ఏపీకి సంబందించిన సమస్యలపై ఒక నోట్ తయారు చేసుకుంటున్నారని.. వాటిలో సానుకూల అంశాలు.. ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయని.. వీటిపై కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయనున్నారని అంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే.. కేసీఆర్ రాజకీయ వ్యూహం కూడా ప్రధానంగా చర్చకు వస్తోంది. కేసీఆర్ అంచనా ప్రకారం.. ఏపీ నుంచి సుమారు 50 మంది వరకు ఆయనకు మద్దతు పలుకుతారని.. తాజా లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కనుక లైన్‌లోకి వస్తే.. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే.. చాలా మందికి టికెట్లు దక్కే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో కనిపించడం లేదు. దీంతో అంతో ఇంతో ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు.. స్వతంత్రంగా కన్నా.. ఏదో ఒక పార్టీ పేరుతో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి బీఆర్ఎస్ అందివచ్చే అవకాశం ఉంటుందని,, దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటే సరిపోతుందని.. కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
This post was last modified on October 18, 2022 11:02 am
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…