ఇది డిజిటల్ యుగం. సోషల్ మీడియా హవా సాగుతున్న కాలం. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో దొరికిన ఫొటోను, వీడియోను తీసుకొచ్చి ఫేక్ ప్రచారాలు చేస్తే అంతే సంగతులు. ఫొటోలను కూడా సెర్చ్ చేసి వాటి వివరాలన్నీ బయటికి తీసేసే టెక్నికల్ కింగ్స్ సోషల్ మీడియాలో బోలెడుమంది ఉంటారు.
అందులోనూ సున్నితమైన అంశాల విషయంలో ఇలాంటి తప్పులు చేసి దొరికిపోతే నెటిజన్ల వాయింపుడు మామూలుగా ఉండదు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో ఇదే అనుభవం ఎదురైంది. వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో విశాఖ గర్జన కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కొన్ని పోస్టులు పెట్టారు.
ఒక మత్స్యకార మహిళ తాను విశాఖ రాజధానికి మద్దతు ఇస్తున్నట్లు, ఒక రైతు తాను మూడు రాజధానులకు మద్దతుగా నిలుస్తున్నట్లుగా ఈ పోస్టులు ఉన్నాయి. ఐతే ఇందులో వాడిన మత్స్యకార మహిళ, రైతు ఫొటోలు మనవాళ్లవి కావు. ఎక్కడో ఇంటర్నెట్ నుంచి ఎత్తుకొచ్చినవి. మహిళ ఫొటో 2013లో గోవాలో తీసింది. దానికి సంబంధించిన ఆధారం ఇంటర్నెట్లో ఉంది.
మరోవైపు ఒరిస్సాలో బలరామ్ యోజన అనే ప్రభుత్వ పథకానికి డిజైన్ చేసిన యాడ్‌లో ఉన్న వ్యక్తి ఫొటోను పట్టుకొచ్చి ఆంధ్రా రైతుగా ఇంకోదాంట్లో చూపించారు. విశాఖ గర్జన నేపథ్యంలో ఈ రెండు పోస్టులను వెరిఫైడ్ వైఎస్సార్ సీపీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేయడం విశేషం. ఐతే ఇలా ఆ పోస్టులు పెట్టారో లేదో.. కాసేపటికే వాటి వెనుక అసలు గుట్టును బయటపెట్టేసిన నెటిజన్లు వైసీపీ వాళ్లను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇలా అసలు విషయం బయటపెట్టాక కూడా వైసీపీ హ్యాండిల్ నుంచి ఈ ఫొటోలు డెలీట్ చేయకపోవడం గమనార్హం.
This post was last modified on October 16, 2022 12:43 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…