Political News

జైరాం ను కెలికిన సాయిరెడ్డి… జగన్ ను కెలికిన జైరాం

వైసీపీ కీల‌క నాయ‌కుడు.. రాజ్య‌స‌భ ఎంపీ.. వి. విజ‌యసాయిరెడ్డి ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే టైపు .. అనే పేరుంది. ఎప్పుడు ఎలాంటి విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవాలో.. ఆయ‌న‌కు తెలిసినంత‌గా.. వైసీపీలో మ‌రొక‌రి తెలియ‌ని అంటారు. ఇటీవల రాహుల్ గాంధీ.. చేప‌ట్టిన పాద‌యాత్ర ఏపీలో ప్ర‌వేశించిన‌ప్పుడు.. ఆయ‌న ఒక ట్వీట్ చేశారు. ఏపీని విభ‌జించిన వారు.. ఎలా అడుగు పెడ‌తారు? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఈ విష‌యాన్ని ఆయ‌న‌కు ప్ర‌జ‌లే గుర్తు చేయాలంటూ.. కామెంట్ చేశారు. అయితే.. సాయిరెడ్డి ఈ విష‌యంలో తాను స‌క్సెస్ అయ్యాన‌ని అనుకుని ఉండొచ్చు. కానీ, దీనికి కాంగ్రెస్ భారీ కౌంట‌రే ఇచ్చింది.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు మద్దతిచ్చారని, దీనిపై అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి లేఖ రాశారని కాంగ్రెస్ సీనియ‌ర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. తాను బళ్లారిలో ఉన్నానని, ప్రస్తుతం ఆ లేఖ తన వద్ద లేదని, పుస్తకంలో ఉందని వివరించారు. భారత్‌ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదని, ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన విషయాన్ని ప్రజలు రాహుల్‌ గాంధీకి గుర్తు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ నేప‌థ్యంలోనే తాను రియాక్ట్ అవుతున్న‌ట్టు జైరాం చెప్పారు.

సాయిరెడ్డి ట్వీట్ నేప‌థ్యంలో 2012 డిసెంబరు 28న కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు అప్పటి వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేత ఎంవీ మైసురారెడ్డి, సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి రాసిన లేఖను పోస్టు చేశారు. “2011 జులై 8, 9వ తేదీల్లో జరిగిన పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ గౌరవిస్తుందని పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం, లేదా విభజించడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది. అయినా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమే మేము కోరుతున్నాం” అని అందులో ఉంది.

ఆ లేఖను జైరాం రమేశ్‌ మళ్లీ రీపోస్టు చేస్తూ.. ‘జగన్‌ ఆమోదించాకే వైసీపీకి చెందిన సీనియర్‌ నాయకులు ఈ లేఖను పంపారు. గుర్తుందా? ఇంకా ఏమైనా చెప్పాలా?’ అని ప్రశ్నించారు. మ‌రి సాయిరెడ్డి దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా.. పిల్లి క‌ళ్లుమూసుకుని పాలు తాగితే.. ప్ర‌పంచం చూడ‌ద‌ని అనుకుంటే ఎలా.. అని స‌టైర్లు ప‌డుతున్నాయి.

This post was last modified on October 16, 2022 12:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

55 mins ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

57 mins ago

ఏపీ హింస‌.. నిప్పులు చెరిగిన ఈసీ..

రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత చెల‌రేగిన తీవ్ర హింస‌ పై కేంద్ర ఎన్నికల సంఘం…

7 hours ago

దెయ్యాన్ని ప్రేమించే ‘లవ్ మీ’ కుర్రాడు

https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…

14 hours ago

రవితేజ సమస్యే నానికి వచ్చిందా

కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…

16 hours ago

విశ్వంభరలో స్టాలిన్ అక్కయ్య

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…

17 hours ago