సినీ నటుడు బాలకృష్ణ నిర్వహించిన అన్ స్టాపబుల్-2 రియాల్టీ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి సంగతలు నుంచి రాజకీయాల వరకు అనేక విషయాలను పంచుకున్నారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే.. కొన్ని చిలిపి విషయాలను కూడా.. చంద్రబాబు వెల్లడించారు. తొలుత బాలయ్య మాట్లాడుతూ.. ‘బావ.. మీరు ఎప్పుడైనా రొమాన్స్ చేశారా?’ అని అడిగితే..చంద్రబాబు చాలా సరదాగా ఆన్సర్ చేశారు. మీకన్నా ఎక్కువే చేశానంటూ.. సమాధానం ఇచ్చారు. యూనివర్సిటీలో చదివే రోజుల్లో అమ్మాయిలు వస్తున్నారంటే.. బైకులకు సైలెన్సర్లు తీసేసి మరీ.. రయ్..రయ్యన.. దూసుకుపోయేవాళ్లమని చెప్పారు.
దీనికి బాలయ్య రియాక్ట్ అవుతూ.. “అయితే.. అప్పట్లో మీరు చందు.. ఇప్పుడు చంద్రబాబు అన్నమాట!” అని సటైర్ పేల్చారు. అంతేకాదు.. యూని వర్సిటీ రోజుల్లో చదువుకు ప్రాధాన్యం ఇస్తూనే.. నాయకత్వ లక్షణాలను పెంచుకునేందుకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. అయితే.. అప్పట్లో తనను చూసిన వారు.. ఇలా.. ఈ స్థాయికి ఎదుగుతానని అనుకోలేదని చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు అమెరికాలో పర్యటిస్తే.. ఒక కార్యక్రమానికి ప్రవాస భారతీయులు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముగించుకున్నాక.. ఒక లేడీ తన దగ్గరకు వచ్చి.. “మీరు అప్పటి చంద్రబాబేనా?” అని ఆసక్తిగా ప్రశ్నించినట్టు చంద్రబాబు తెలిపారు.
ఔను.. అప్పటి చంద్రబాబునే.. కానీ, ఇప్పుడు వేరు.. అని సమాధానం చెప్పినట్టు చంద్రబాబు తెలిపారు. ఇంట్లో కూడా అందరం సరదాగా ఉంటామని బాబు తెలిపారు. ఇంట్లో పెత్తనం అంతా తన సతీమణి భువనేశ్వరిదేనన్న చంద్రబాబు.. ఆమెను ‘భువ్వు’ అని పిలుస్తానని వెల్లడించారు. ఈ క్రమంలో నేరుగా కార్యక్రమం నుంచే ఫోన్‌లో ఆమెతో సంభాంచారు. ఈ సందర్భంగా.. తన సోదరికి ఐలవ్‌యూ చెప్పాలని బాలయ్య ఒత్తిడి చేశారు. అయితే.. చంద్రబాబు మాత్రం ఐలైక్ యూ అని చెప్పి.. ఐలవ్‌యూ కన్నా.. ఇది మరింత బలమైన బంధమని చెప్పుకొచ్చారు. ఇలా.. బాలయ్యతో కేవలం రాజకీయాలే కాకుండా.. కుటుంబ విషయాలను సైతం చంద్రబాబు పంచుకోవడం గమనార్హం.
This post was last modified on October 15, 2022 2:04 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…