తాజాగా దివంగత ఎన్టీఆర్ వ్యవహారం.. మరోసారి ప్రధాన మీడియా స్రవంతిలోకి వచ్చి చేరింది. ఇటీవల కా లంలో వైసీపీ నాయకులు.. టీడీపీని కార్నర్ చేసే ఉద్దేశంతో.. వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారం టూ .. కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి.. చినుకు.. చినుకు.. గాలివానగా మారినట్టుగా.. పరిస్థితి మారి పోయింది. దీంతో దీనికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే.. టీడీపీ నాయకుడు, నటుడు బాలయ్య నిర్వహించి న ‘అన్ స్టాపబుల్’ షోలో.. చంద్రబాబును తీసుకువచ్చారు.
సరే.. ఈ సందర్భంగా.. చంద్రబాబు అప్పటి పరిణామాలను వివరించారు. దీనిని సమర్థించిన వారు ఉన్నారా.. లేరా.. అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ విషయంలో చంద్రబాబు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఎలాగంటే.. ఆ రోజు ఏం జరిగిందనేది తాను చెబుతూ.. అదేసమయంలో అన్నగారి చిన్నకుమారుడు.. బాలకృష్ణతోనూ.. చెప్పించారు. మధ్య మధ్యలో బాలయ్య కూడా.. అప్పుడు ఏం జరిగిందో వివరించారు. అంతేకాదు.. ”ఆ నిర్ణయం ఏ ఒక్కరిదో కాదు.. అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం” అని తెలిపారు.
అంటే.. ఎన్టీఆర్ నుంచి పార్టీని తీసుకున్నారు… అనే విషయంలో ఎవరైనా.. చంద్రబాబును విమర్శిస్తే.. అది నందమూరి కుటుంబాన్ని కూడా విమర్శించినట్టే.. అనే సందేశాన్ని స్పష్టంగా సమాజంలోకి పంపేశా రు. ఇప్పటి వరకు కొందరు వైసీపీ నాయకులు.. ముఖ్యంగా కొడాలి నాని వంటివారు.. నందమూరి కుటుం బాన్ని ఏమీ అనకుండా.. చంద్రబాబును ఏకేస్తున్నారు. ఆయనపై విరుచుకుపడుతున్నారు. కానీ, ఇప్పు డు.. ‘ఆ తప్పు.. లేదా రైటు’ లేదా.. వైసీపీ భాషలో ‘వెన్నుపోటు’ ఏదైనా కూడా.. నందమూరి కుటుంబానికి తెలిసే జరిగింది.
వారి సమక్షంలోనే జరిగింది. సో.. ఇకపై వైసీపీ నాయకులు.. దీనిపై ఎలాంటి విమర్శలు చేయడానికి లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ విషయంలో కీలకమైన ఎన్టీఆర్ కుటుంబం పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. సో.. మొత్తంగా చూస్తే.. ఇక, ఎన్టీఆర్ గురించి కానీ, ఆయన పార్టీ గురించి కానీ.. ఎవరు నోరు విప్పినా.. ఎలాంటి విమర్శలు చేసినా.. నందమూరి కుటుంబాన్ని కూడా.. అన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో.. మొత్తానికి బాబుపై ఇక, ఆ మరక పోయినట్టే!! అంటున్నారు టీడీపీ అభిమానులు.
This post was last modified on October 15, 2022 2:02 pm
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…