మాజీ మంత్రి కొడాలి నాని పై గుడివాడ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. “కొడాలి నానిని జైలుకు పంపకుంటే నా చెవులు కోసుకుంటా” అని రావి సవాల్ చేశారు. కొడాలి నాని కాళ్ళు పట్టుకొని అడుక్కోవడంతోనే చంద్రబాబు ‘బి’ ఫారం ఇచ్చారని గుర్తుచేశారు. గుడివాడలో హరికృష్ణ ను ఓడించింది కొడాలి నానినే అని అన్నారు. చరిత్రను ఎవ్వరూ మోసం చెయ్యలేరని తెలిపారు.
కొడాలి జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలే అని మండిపడ్డారు. ఎన్టీఆర్ బిడ్డల గురించి ఎంత దారుణంగా మాట్లాతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారని… కొడాలి నాని గుడ్డలు ఊడదీసి కొడతారని ఆయన హెచ్చరించారు. నాని గడ్డంలోని తెల్ల వెంట్రుక పీకలేరని రోజా అంటున్నారని… వెంట్రుకను ఆమె ఎప్పుడు చూసిందో అంటూ యెద్దేవా చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులకు సిగ్గు లజ్జ లేదని… జగన్ ది దోపిడీ దొంగల కుటుంబమని వ్యాఖ్యలు చేశారు.
పోలీసులు ఖాకీ చొక్కాలు విప్పి వైసీపీ జెండాలు పట్టుకోవాలని అన్నారు. వ్యవస్థల్లో ప్రధానమైన మీడియాపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కొడాలి నానిని చెప్పుతో కొట్టాలన్నారు. అధికారం అడ్డం పెట్టుకొని కొడాలి నాని సంపాదించిన 5వేల కోట్ల అవినీతి సొమ్ము వైజాగ్, శామీర్‌పేట, బెంగుళూరు లో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. కొడాలి బినామీ దారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే గడ్డం గ్యాంగ్ అరాచకాలను ఉక్కు పాదంతో అనిచి వేస్తానని రావి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
This post was last modified on October 15, 2022 7:15 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…