Political News

రేవంత్ ఈ 3 గండాలు దాటితేనే…!

మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మూడు గండాలను దాటుకొని పార్టీని విజయతీరాలకు చేర్చాల్సి ఉంది. ఇవి ఆయన ప్రతిభకే గీటురాయిగా మిగలనున్నాయి. ఈ మూడింటిలో ఏ ఒక్క దాంట్లో ఆయన విఫలమైనా టీ కాంగ్రెస్ లో ఆయన గురించి చరిత్రగానే చెప్పుకోవాల్సి వస్తుంది. దీంతో రేవంత్ ఒకింత గుబులుగానే ఉన్నట్లు తెలుస్తోంది.

రేవంతుకు ఎదురుకానున్న ఆ మూడు గండాలు మరేమిటో కావు.. మునుగోడు ఉప ఎన్నిక, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు, రాహుల్ భారత్ జోడోపాదయాత్ర. ఈ మూడు అంశాలను విజయవంతం చేయడంపైనే రేవంత్ భవితవ్యం ముడిపడి ఉంది. అందుకే ఆయన ఈ అంశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతూ వీటిల్లో ఎలా గట్టెక్కాలనే ఆలోచనలో పడిపోయారట.

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి రేవంత్ ఖాతాలోకి రాలేదు. అప్పుడే కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం.. ఈటెలపై సానుభూతి వల్ల ఓటమిని అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇపుడు అలా కాదు. రేవంత్ పార్టీ పగ్గాలు చేపట్టి ఏడాదిపైనే గడిచింది. ఈ పాటికి జిల్లాల్లో సమీక్షలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. అధిష్ఠానం అనుకున్నతంగా పార్టీ గ్రాఫ్ పెరగలేదు.

ఎప్పటికప్పుడు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అనేలా సాగింది రేవంత్ ప్రస్థానం. పార్టీలో సీనియర్ల అసమ్మతిని చల్లార్చడానికే పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. వారి అసమ్మతి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా ఉంది. సీనియర్ల సహకార లేమి.. లోటు బడ్జెట్ కారణంగా రేవంత్ ఉప ఎన్నికలో ముందడుగు వేయలేని పరిస్థతి నెలకొంది. దీనికి తోడు ఇపుడు రాహుల్ పాదయాత్ర కూడా చుట్టుకోవడంతో ఎలా దిగ్విజయం చేయాలనే సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది. ఇది రేవంత్ రెడ్డికి ఒక విషమ పరీక్షగానే చెప్పుకోవాలి.

అదీ కాకుండా ఇదే నెలలో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ఉండడం.. అందులో పార్టీ ప్రతినిధులను సమన్వయం చేసి సోనియా విధేయుడు మల్లికార్జున ఖర్గేకు ఓట్లు పడేలా చూసుకోవడం మొదటి బాధ్యత. ఆ తర్వాత అతి పెద్ద కార్యక్రమం రాహుల్ పాదయాత్ర. తెలంగాణలో 13 రోజుల పాటు 375 కిలోమీటర్ల యాత్రను ఆద్యంతం దగ్గరుండి చూసుకోవడం.. అన్ని పక్షాల నుండి నేతలను, జనాలను తరలించడం తలకు మించిన భారమే. ఇదిలా ఉండగానే మునుగోడు ఉప ఎన్నిక జరగడం.. ఫలితాలు వెలువడడమే తరువాయి. ఇన్ని గండాలను దాటుకొని రేవంత్ ఎలా ముందడుగు వేస్తాడో చూడాలి. లేదంటే తన పదవికే గండం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..?

This post was last modified on October 14, 2022 6:03 pm

Share

Recent Posts

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

17 minutes ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

1 hour ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

1 hour ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago