ఏపీ అధికార పార్టీకి రాష్ట్రంలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ విషయం పార్టీ నేతలకు కూడా తెలుసు. ఈ క్రమంలోనే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. చూస్తానని.. ప్రకటిం చారు. అంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు.. అంతా కూడా… ఒకే పార్టీకి(అది కూటమి కావొచ్చు) పడేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తానని.. ఆయన ప్రకటించారు. ఇది వైసీపీ నేతలకు బాగానే ఇబ్బంది పెడుతోంది.
అందుకే తరచుగా.. వాళ్లు.. ‘దమ్ముంటే.. ఒంటరిగా పోటీ చేయాలంటూ’ కామెంట్లు చేస్తున్నారు. పవన్ సహా.. టీడీపీని కూడా రెచ్చగొడుతున్నారు. దీనికి కారణం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. తమకు లబ్ధి చేకూరుతుందనే ఆలోచన కావొచ్చు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా ఆవిర్భవించడం.. పొరుగు రాష్ట్రాల్లోనూ దీనిని విస్తరించాలనే ప్లాన్ వేసుకోవడం.. వంటివి.. వైసీపీ నేతలను ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి.
“బీఆర్ఎస్ ఇక్కడకు కూడా రావాలి. ఏ పార్టీకైనా.. స్వేచ్ఛ ఉంటుంది. పైగా.. తెలుగు వారు ఒక జాతీయ పార్టీ పెట్టి.. ఢిల్లీలో జెండా ఎగరేస్తామంటే..మనం ప్రొత్సహించకపోతే.. ఎలా?!” అని వైసీపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిజానికి ఒకవైపు.. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో ఎలా అడుగు పెడుతుందనే టాక్ మేధావుల నుంచి వినిపిస్తోంది. ఏపీకి ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణమైన.. టీఆర్ఎస్.. అధినేత కేసీఆర్.. ఎలా అడుగు పెడతారని అంటున్నారు.
అయితే.. దీనికి భిన్నంగా రాయలసీమకు చెందిన వైసీపీ నాయకులు మాత్రం కేసీఆర్ రావాలి.. ఏపీకి కావాలి.. అని దీర్ఘాలు తీస్తున్నారు. దీని అంతరార్థం.. ఏంటా అని కొంచెం లోతుగా చూస్తే.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు ఇప్పుడున్న ఆయుధం.. బీఆర్ఎస్ ఒక్కటేననివారు నమ్ముతుండడమే. బీఆర్ ఎస్ కనుక.. ఏపీలో పోటీకి దిగితే.. ఇక, వ్యతిరక ఓటు బ్యాంకు చీలి.. తమకు మేలు జరుగుతుందని వైసీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. మరి .. దీనిని ఎలా చూడాలో.. చూస్తారో.. ప్రజలే తేలుస్తారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 14, 2022 10:27 am
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…