ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేసే విషయం.. వెన్నుపోటు. పిల్లనిచ్చి, పార్టీలో కీలక స్థానం ఇచ్చిన మామ ఎన్టీఆర్ నుంచి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడని చంద్రబాబు మీద ఎన్నో ఏళ్ల నుంచి ప్రత్యర్థి పార్టీల నాయకులు విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆ రోజున్న పరిస్థితుల్లో తప్పక అలా చేయాల్సి వచ్చిందని చంద్రబాబు కొన్ని సందర్భాల్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అది పెద్దగా హైలైట్ కాలేదు.
నిజానికి ఆ పరిణామం జరిగిన కొన్నేళ్లకే జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడాన్ని బట్టి ఆ విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారని, ఆమోదించారని భావించవచ్చు. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా వైసీపీ అదే విషయాన్ని లేవనెత్తి చంద్రబాబును వెన్నుపోటుదారుడిగా అభివర్ణిస్తూ విమర్శలు, ఆరోపణలు చేస్తుంటుంది.
ఐతే ఇలాంటి విషయాల్లో మౌనం వహించడం వల్ల లాభం లేదని చంద్రబాబుకు ఎట్టకేలకు అర్థమైనట్లుంది. అందుకే ఆ ఎపిసోడ్ గురించి ప్రజలకు వివరించి చెప్పాలని ఆయన డిసైడైనట్లున్నారు. మామూలుగా ఒక ప్రెస్ మీట్ పెట్టో, లేదంటే ఏదైనా రాజకీయ సభలోనో దీని గురించి వివరిస్తే జనాలకు సరిగా రీచ్ కాకపోవచ్చు. అందుకే బాలయ్య సూపర్ హిట్ టాక్ షో అన్‌స్టాపబుల్‌ను వేదికగా ఎంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ విషయాన్ని వివరిస్తే దాని రీచ్‌యే వేరుగా ఉంటుందని తెలివిగానే పసిగట్టారు. షోకు వచ్చామా నాలుగు తమాషా కబుర్లు చెప్పామా అని కాకుండా ఇలాంటి వివాదాస్పద అంశాన్ని ఎంచుకుని సవివరంగా అసలేం జరిగిందో, ఏ పరిస్థితుల్లో తాను అలా చేయాల్సి వచ్చిందో వివరించాలని అనుకోవడం చంద్రబాబు వేసిన మంచి ఎత్తుగడగా భావించాలి.
ఇది వైసీపీకి బాబు-బాలయ్య కలిసి ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్‌గా భావించవచ్చు. అలాగే నారా లోకేష్ అమ్మాయిలతో కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ ఫొటోల విషయంలోనూ వైసీపీ ఎప్పుడూ విమర్శలు చేస్తుంటుంది. దానికి కూడా ఈ కార్యక్రమంలో లోకేష్ వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ రెండు విషయాల్లో జనాలకు స్పష్టత ఇవ్వాలని తండ్రీ కొడుకులు భావించడం మంచి విషయమే. ఈ ఎపిసోడ్ కోసం తెలుగుదేశం మద్దతుదారులే కాదు, సామాన్య జనాలు.. ఇంకా చెప్పాలంటే వైసీపీ వాళ్లు కూడా ఎదురు చూసేలా అదిరిపోయే ప్రోమోను కట్ చేశారు.
This post was last modified on October 11, 2022 10:54 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…