ఊపందుకుంటున్న మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా కలకలం మొదలైంది. కారణం ఏమిటంటే నియోజకవర్గంలో కీలకమైన చండూరు మండలం కేంద్రంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పోస్టర్లు వెలవటమే. ఈ పోస్టర్లను ఎవరు వేశారో తెలీదు. రాజగోపాలరెడ్డి ప్రతిఓటుకు వేలాది రూపాయలు ఇవ్వటానికి రెడీ అయ్యారని, కావాల్సిన వారు పలానా నెంబర్ కు ఫోన్ చేయండంటు ఫేన్ పే మొబైల్ నెంబర్ ఇచ్చున్నారు.
ఫోన్ పే రూపంలో కాంట్రాక్ట్ పే అని పోస్టర్లలో ఉంది. రు. 18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు తీసుకున్నారు కాబట్టి ఓటుకు ఎంత డబ్బైనా ఇవ్వటానికి రాజగోపాలరెడ్డి రెడీ అన్నట్లుగా పోస్టర్లలో ఉంది. నియోజకవర్గంలోని చండూరు పట్టణంలో వేలాది పోస్టర్లు అతికించారు. మొదటినుండి కూడా రాజగోపాల్ కేవలం కాంట్రాక్టుల కోసమే కాంగ్రెస్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే ఆరోపించారు.
అక్కడినుండి చాలామంది మాజీ ఎంఎల్ఏపై ఇదే విదమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకదశలో తనపై ఆరోపణలను రాజగోపాల్ తిప్పికొట్టారు. అయితే ఆయనకు ఛత్తీస్ ఘర్లో బొగ్గు కాంట్రాక్టు రావటం, కొద్దిరోజులకే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరటం లాంటివి జరగటంతో జనాల్లో కూడా ఇదే విషయం బాగా రిజస్టర్ అయిపోయింది. దీనికితోడు మూడురోజుల క్రితం రాజగోపాల్ మాట్లాడుతు తనకు బొగ్గుగనులు దక్కినమాట వాస్తవమే అని అంగీకరించారు. పైగా తన గెలుపుకోసమే తన అన్న, కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేస్తారని మీడియా సమావేశంలోనే ప్రకటించారు.
దాంతో బ్రదర్స్ ఇద్దరికీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా మామూలు జనాల్లో కూడా చర్యలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఈ నేపధ్యంలోనే బీజేపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవటటం సంచలనంగా మారింది. వ్యక్తిగతంగా అభ్యర్ది ఆర్ధికంగా పటిష్టమైన స్ధితిలో ఉన్నారు కాబట్టి ఓటుకునోటుకు పంచటంలో ఎలాంటి లోటుండదని అందరికీ తెలుసు.
This post was last modified on October 11, 2022 2:40 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…