Political News

టీడీపీలో హ‌ద్దు మీరుతున్న స్వేచ్ఛ‌.. బాబు ఉపేక్షిస్తే.. ఇబ్బందే!

ఏదో ఒక సంద‌ర్భంలో.. పార్టీని బ‌జారున ప‌డేశారు.. అంటే.. స‌ర్దుకోవ‌చ్చు. లేదా రెండు సంద‌ర్భాల్లో అం టే.. ఓర్చుకోవ‌చ్చు. ప‌దే ప‌దే అదే ప‌నిచేస్తే.. ఇంకా ఎన్నిసార్లు.. ఓర్చుకోవాలి? ఇదీ..ఇప్పుడు విజ‌య‌వాడ టీడీపీ రాజ‌కీయాల‌పై పార్టీ అభిమానులు సంధిస్తున్న ప్ర‌శ్న‌. విజ‌య‌వాడ ఎంపీ.. కేశినేని నాని వ్య‌వ‌హారం .. ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డం లేదు. ఆయ‌న ఏం చేస్తున్నారో.. ఏం చేస్తారో.. కూడా ఎవ‌రికీ తెలియ‌డం లేదు. పార్టీ ఇప్పుడు అత్యంత కీల‌క‌మైన ప‌రిస్థితిలో ఉంది.

రోజు రోజుకు రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. ఇలాంటి సంద‌ర్భంలో నాని.. వంటి సీనియ‌ర్ ఎంపీ.. పార్టీని ముందుండి న‌డింపించాల్సింది పోయి.. పార్టీని ఇర‌కాటంలోకి నెట్టే ప‌నులు చేయ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. గత మూడేళ్లుగా.. కూడా.. ఇదే ప‌ద్ధతిలో నాని న‌డుస్తున్నాడ‌నేది పార్టీ అభిమానుల మాట‌. లోక‌ల్ నేత‌ల‌తో క‌య్యానికి కాలు దువ్వ‌డం.. పార్టీపై స‌టైర్లు వేయ‌డం.. శ‌త్రువుల‌తో స్నేహం చేస్తాన‌ని హెచ్చ‌రించ‌డం.. కీల‌క‌నేత‌ల‌ను అభాసుపాల్జేయ‌డం.. వంటివి ఆయ‌న‌కు నిత్య కృత్యంగా మారాయ‌ని అంటున్నారు.

తాజాగా విజ‌య‌వాడ పార్ల‌మెంటు ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి నెట్టెం ర‌ఘురామ్‌పైనా.. కేశినేని నాని విమ‌ర్శ‌లు, స‌టైర్లు సంధించారు. ‘పార్టీలో క్ర‌మ శిక్ష‌ణ ఉందా?’ అనే ప్ర‌శ్న‌లు సంధించారు. ఒక విష‌యాన్ని పుర‌స్క‌రించుకుని.. పార్టీ క్ర‌మ శిక్ష‌ణా సంఘానికి ఫిర్యాదు చేస్తే.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని..నెట్టెం ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఎంపీ కేశినేని నాని.. “మ‌న పార్టీలో క్ర‌మ శిక్ష‌ణ సంఘం ఉందా? ఉంటే.. నేను రుజువులు ఆధారాల‌తో కొన్ని పంపిస్తాను.. చ‌ర్య‌లు తీసుకోండి చూద్దాం” అని వ్యంగ్యాస్త్రం సంధించారు.

అంటే.. నాని ఉద్దేశంలో పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని.. ఎవ‌రి ఇస్టానుసారం వారు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే భావ‌న ఉంది. అయితే..నిజంగానే ఆయ‌న ఈ భావ‌న ఉంటే.. దీనిని పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాలి. కానీ, ఇలా పార్టీ ప‌రువును బ‌జారున ప‌డేయడం ఎందుకు? అనేది పార్టీ అభిమానుల మాట‌. ఇక‌, చంద్ర‌బాబు సైతం.. ఇలా పార్టీని రోడ్డుకు లాగుతున్న వారి విష‌యంలో ఎందుకు ఉపేక్షిస్తున్నార‌నేది కూడా మిలియ‌న్‌డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రి ఇప్ప‌టికైనా.. ఇలాంటి వారిని అదుపు చేయ‌క‌పోతే.. రేపు మరింత మంది పార్టీకి గుదిబండ‌లు మార‌డం ఖాయ‌మ‌ని అభిమానులు హెచ్చ‌రిస్తున్నారు.

This post was last modified on October 10, 2022 1:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

31 minutes ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

2 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

4 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

5 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

6 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

7 hours ago