దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకే టీఆర్ఎస్ పార్టీని కేసీయార్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా విస్తరించటం మాటేమిటో కానీ తెలంగాణాలోనే షాక్ తప్పేట్లు లేదని సమాచారం. కారణం ఏమిటంటే ఇంతకాలం మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం తన విస్తరణను సొంత రాష్ట్రంలో కూడా చేయాలని అనుకున్నదట. కేసీయార్ తో ఉన్న స్నేహం కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమున్నా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పార్టీ విస్తరణకు ప్రయత్నించలేదు.
గడచిన రెండు ఎన్నికల్లో కేవలం కేసీయార్ కోసమనే ఎంఐఎం పోటీని ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితం చేశారు. ఓల్డ్ సిటీలోని ఏడు అసెంబ్లీ సీట్లు, హైదరాబాద్ ఎంపీ సీటుకు మాత్రమే పోటీ చేస్తున్నారు. మరి తాజాగా వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలీదు కానీ ఎంఐఎం కూడా మరికొన్ని సీట్లలో పోటీచేయాలని డిసైడ్ చేసిందని సమాచారం. నిజానికి కేసీయార్ కన్నా ముందే ఎంఐఎంను దేశవ్యాప్తంగా విస్తరించుందకు అసదుద్దీన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
తన ప్రయత్నాల్లో భాగంగానే ఎంఐఎం మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసింది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో పార్టీ తరపున ఎంఎల్ఏలు కూడా గెలిచారు. అలాగే పై రాష్ట్రాల్లోని లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా కొందరు గెలిచారు. ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారగానే వేరే రాష్ట్రాల్లోని ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకుని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నది. బహుశా ఈ విషయంలో కేసీయార్-అసదుద్దీన్ మధ్య విభేదాలు వచ్చినట్లుంది.
అందుకనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సుమారు 30 అసెంబ్లీ సీట్లకు పోటీచేయాలని ఎంఐఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పోటీకి ఎంఐఎం రెడీ అవుతోందట. ఎందుకంటే ఈ జిల్లాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకవిధంగా మైనారిటీల ఓట్లే గెలుపోలములను శాసించే స్థాయిలో ఉన్నాయి. కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పార్టీని బలోపేతం చేయాలని అసదుద్దీన్ డిసైడ్ అయ్యారని టాక్. ఇదే జరిగితే కచ్చితంగా కేసీయార్ కు షాక్ తప్పదు.
This post was last modified on October 9, 2022 11:27 am
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…