మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు.. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. తాజాగా మెగా స్టార్ చిరంజీవితో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో గంటా శ్రీనివాసరావు.. చిరుతో భేటీ అయి.. అభినందించారు. అయితే.. ఈ సందర్భంగా.. వీరి మధ్య రాజకీయ ప్రస్తావన కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం రాజకీయంగా టీడీపీలో ఉన్న గంటా.. ఆ పార్టీలో యాక్టివ్‌గా అయితే లేరు. వచ్చే ఎన్నికల్లో పోటీ పైనా..క్లారిటీ లేదు. మహానాడు నిర్వహించినప్పుడు కూడా.. ఆయన రాలేదు. పార్టిసిపేట్ చేయలేదు. ఇక, చంద్రబాబు కూడా.. గంటాను ఆయన ఇష్టానికే వదిలేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిరుతో గంటా భేటీ ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. గతంలో 2007లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. గంటా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
తర్వాత..కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం అయినప్పుడు కాంగ్రెస్‌లో మంత్రి పదవిని కూడా పొందారు. ఈ క్రమంలో చిరుతో భేటీ ప్రాధాన్యం దక్కించుకుంది. ఎందుకంటే.. ఇటీవల చిరు.. తాను పవన్‌కు అండగా ఉండేందుకు రెడీయేనని ప్రకటించారు. పవన్ కోరితే.. తాను ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తానని కూడా ప్రకటించారు. దీంతో జనసేన దూకుడు పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో గంటా.. చిరు భేటీకి రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.
టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా.. ఎన్నికలకు ముందు జనసేన తీర్థం పుచ్చుకుంటారనే చర్చ సాగుతోంది. అయితే.. దీనిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. పైగా.. వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినా.. గంటా తిరస్కరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చిరుతో భేటీలో ఆయన జనసేన ఎంట్రీ గురించి ఏమైనా చర్చించారా? అనేది ఆసక్తిగా మారింది. చూడాలి.. మరి ఏం జరుగుతుందో!. కొసమెరుపు ఏంటంటే.. గంటా శ్రీనివాసరావు.. ఎప్పుడు ఎక్కడ ఏ పార్టీతో చేతులు కలిపినా.. ఎక్కడ నుంచి పోటీ చేసినా.. ఆయన గెలుపు గుర్రం ఎక్కుతూనే ఉన్నారు.
This post was last modified on October 8, 2022 6:58 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…