తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ.. పార్టీ పెట్టిన ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలను పట్టించుకునేవారే కరువయ్యారు. పార్టీల సంగతి పక్కన పెడితే..ప్రజలు సైతం ఆమెను పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. దీంతో ఏదో ఒక రకంగా.. మీడియాలో ఉండాలని.. కవరింగ్ పొందాలని.. తెగ ఉబలాట పడుతున్నారని అంటున్నారు నెటిజన్లు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల.. ఢిల్లీ వెళ్లారు.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్నారట. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ.. దానిపై విచారణ జరపాలని సీబీఐని కోరునున్నారట. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కోట్లు దోచేసిందని.. సో..చర్యలు తీసుకోవాలని.. అభ్యర్థించనున్నారట. అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయనున్నారట.
పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల అకస్మాత్తుగా నిలిపివేసి మరీ డిల్లీ వెళుతుండడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదేవిధంగా నెటిజన్లు కూడా ఆసక్తిగానే గమనిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేసిన.. షర్మిల ఇప్పుడు మరి ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో చూడాలి. అయితే.. ఆమె వెంట గట్టు రామచంద్రరావు, పలువురు వైఎస్సార్ టీపీ నేతలు ఉన్నారు.
అయితే.. షర్మిల పర్యటనకు సంబంధించి నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఎలాగూ సీబీఐ దగ్గరకు వెళ్తున్నారు కదా.. మరి ఏపీ సీఎం, మీ సోదరుడు.. జగన్ కేసులను కూడా కొంచెం త్వరగా.. విచారించమని .. ‘నిజాల’ నిగ్గు తేల్చమని.. కోరితే.. అప్పుడు మీ నిజాయితీ.. నిలువెత్తున నమ్ముతామని.. అంటున్నారు. ఎందుకంటే.. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. అంతో ఇంతో నీతిగా ఉండాలని చెబుతున్నారు. మరి షర్మిల ఈ ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.
This post was last modified on October 7, 2022 5:28 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…