కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళదాం అంటే ప్రత్యేక తెలంగాణా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న రోజుల్లోకి. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడగటంలో తప్పులేదు కానీ సీమాంధ్రులంటూ నానా గోల చేసే వాళ్ళు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితతో పాటు జేఏసీ ఛైర్మన్ గా పనిచేసిన కోదండరామ్ మరికొందరు సీమాంధ్రులను, రాష్ట్రాన్ని పరిపాలించిన సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులను బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.
అప్పటివరకు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళల్లో సీమాంధ్రులూ ఉన్నారు తెలంగాణా నేతలూ ఉన్నారు. కానీ తెలంగాణా డెవలప్ కాకపోవటానికి కేవలం సీమాంధ్ర ముఖ్యమంత్రులే కారణమంటూ నానా మాటలన్నారు. మరి తెలంగాణా నుంచి పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య లాంటి వాళ్ళూ సీఎంలయ్యారు. పదుల సంఖ్యలో కేంద్ర మంత్రులుగా, వందల మంది రాష్ట్రంలో మంత్రులుగా పనిచేశారు. మరి వీళ్ళ హయాంలో తెలంగాణా ఎందుకు అభివృద్ధి జరగలేదు ?
అంటే అభివృద్ధి జరగటం లేదా జరగకపోవటం అన్నది తెలంగాణా పాలకులు లేదా సీమాంధ్ర పాలకుల మీద లేదు. స్ధానిక ఎంఎల్ఏలు, ఎంపీలు, మంత్రుల కమిట్మెంట్ మీద ఆధారపడుంది. కానీ ప్రత్యేక తెలంగాణా సాధన కోసం అప్పట్లో కేసీయార్ సీమాంధ్రుల మీద విషం చిమ్మారు. పాలకులను తిట్టడంతో సరిపెట్టుకోకుండా సీమాంధ్ర సంస్కృతి, ఆహారం విషయంలో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు. అవసరమున్నా లేకపోయినా సీమాంధ్రలంటు బూతులు తిట్టారు.
అప్పట్లో సీమాంధ్రులను ఇన్ని రకాలుగా అవమానించిన కేసీయార్ ఇపుడు అదే సీమాంధ్రలో తన పార్టీ కోసం ఏ విధంగా పర్యటిస్తారు ? ఎన్నికలు వచ్చినపుడు తమ పార్టీ అభ్యర్ధులకు ఓట్లేయమని ఏ విధంగా అడగ్గలరు ? అప్పట్లో అల్లమైన సీమాంధ్ర ఇపుడు బెల్లం ఎలాగవుతోంది ? రాష్ట్రం విడిపోయి రెండు ఎన్నికలు జరిగినా ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదంటే అందుకు కేసీయారే కారణమని సీమాంధ్ర జనాలు నమ్ముతున్నారు. మరీ ప్రశ్నలకు కేసీయార్ సమాధానం చెబుతారా ?
This post was last modified on October 7, 2022 7:46 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…