Political News

ఆ ఎంపీ టికెట్లు ఎవ‌రికి? టీడీపీలో త‌ర్జ‌న భర్జ‌న‌

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 15-20 దాకా ఎంపీస్థానాల‌ను ద‌క్కించుకోవాల‌ని.. టీడీపీ ప్లాన్ చేసుకుంది. దీనికి త‌గ్గ‌ట్టుగానే .. అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే.. అనుకున్న విధంగా మాత్రం ప‌రిస్తితి క‌నిపించ‌డం లేదట‌. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎమ్మెల్యే టికెట్ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారు. దీంతో పార్ల‌మెంటు స్థానాల‌పైనా.. దృష్టి పెట్టాల‌ని.. నాయ‌కులు కోరుతున్నారు. ముఖ్యంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి అభ్య‌ర్థుల కొర‌త వెంటాడుతోంది. ఈ జాబితా త‌లుచుకుంటేనే బాధేస్తోంద‌ని.. సీనియ‌ర్లు అంటున్నారు.

మ‌రి అంత‌గా టీడీపీకి వ‌చ్చిన ఇబ్బందేంటి? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో పాతిక నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. దాదాపు ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి అభ్య‌ర్థులు లేరు. ఈ జాబితాలో.. చిత్తూరు, తిరుప‌తి, న‌ర‌సారావు పేట‌, బాప‌ట్ల‌, మ‌చిలీప‌ట్నం(కొన‌క‌ళ్ల‌కు ఇష్టం లేదు), అనంత‌పురం, క‌ర్నూలు, క‌డ‌ప, రాజ‌మండ్రి, కాకినాడ‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌లు అభ్య‌ర్థులే లేకపోవ‌డం.. పార్టీని క‌ల‌వ‌ర‌ప‌రుస్తొంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన వారు.. ఇప్పుడు యాక్టివ్‌గా లేక‌పోవ‌డం.. చంద్ర‌బాబు ఎన్నిసార్లు చెప్పినా.. యాక్టివ్ కాక‌పోవ‌డం.. వంటివి ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ఇర‌కాటంలో పడేస్తున్నాయి.

దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్తితి ఏంట‌నేది ఇప్ప‌టికీ ప్ర‌శ్నార్థ‌కంగానే మారింది. అనంత‌పురం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో జేసీ ప‌వ‌న్ పోటీ చేశారు. ఈయ‌న యువ‌కుడే అయినా.. నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డం లేదు. ఉన్నా.. పార్టీ నేత‌ల‌తో క‌లివిడిగా ఉండ‌డం లేదు. ఇక‌, క‌ర్నూలులో గ‌త ఎన్నిక‌ల్లో కోట సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి పోటీ చేశారు. వ‌య‌సు రీత్యా ఆయ‌న‌ను త‌ప్పిస్తే.. ఇక్క‌డ ఎవ‌రికి ఇస్తార‌నేది ప్ర‌శ్న‌. క‌డ‌ప‌లో గ‌త ఎన్నిక‌ల్లో ఆదినారాయ‌ణ‌రెడ్డి పోటీ చేశారు. అయితే..ఆయ‌న ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అదేవిధంగా రాజ‌మండ్రి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో మాగంటి రూపాదేవి పోటీ చేశారు. త‌ర్వాత‌.. ఇనాక్టివ్ అయ్యారు.

కాకినాడ నుంచి చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌ పోటీ చేశారు, త‌ర్వాత వైసీపీలోకి వ‌చ్చారు. దీంతో ఇక్క‌డా టీడీపీ జెండా మోసే నాయ‌కుడు లేరు. చిత్తూరులో గ‌త ఎన్నిక‌ల్లో శివ‌ప్ర‌సాద్ పోటీ చేశారు. త‌ర్వాత ఆయ‌న మ‌ర‌ణించారు. ఇక్క‌డ‌కూడా అభ్య‌ర్థి క‌రువే! తిరుప‌తిలో గ‌త ఎన్నిక‌ల్లోనూ.. త‌ర్వాత ఉప పోరులోనూ.. ప‌న‌బాక ల‌క్ష్మి పోటీ చేశారు. త‌ర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో ఇక్క‌డ ఎవ‌రికి ఇస్తార‌నేది ప్ర‌శ్న‌. న‌ర‌స‌రావుపేట సాంబ‌శివ‌రావు కు ఇచ్చారు.

మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బాప‌ట్ల‌లో మాల్యాద్రి శ్రీరాం కు ఇచ్చారు. ఆయ‌న కూడా ఊసులేకుండా పోయారు. దీంతో ఇక్కడ కూడా కొత్త వారికి త‌ప్ప‌ద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌చిలీప‌ట్నంలో కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌రావు యాక్టివ్‌గానే ఉన్నా.. ఆయ‌న వ‌ద్దంటున్నారు. ఇలా.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు ఏమీ తేల్చ‌క‌పోవ‌డం.. అక్క‌డ నాయ‌కులు లేక‌పోవ‌డం వంటివి పార్టీకి ఇబ్బందిగా మారింద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 7, 2022 5:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నారా కుటుంబం ప్ర‌జ‌ల సొమ్ము దోచుకోదు: భువ‌నేశ్వ‌రి

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం వెళ్లిన‌.. ఆయ న స‌తీమ‌ణి నారా…

21 minutes ago

రివర్స్ గేమ్ ఆడబోతున్న ఉపేంద్ర ?

అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…

31 minutes ago

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై…

1 hour ago

ఆస్ట్రేలియాలో 4వ ఫైట్.. టీమిండియాకు మరో షాక్!

ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…

2 hours ago

బన్నీ చేసిన తప్పు.. చేయని తప్పు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…

2 hours ago

అండర్-19 అమ్మాయిలు అదరగొట్టేశారు!

అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…

2 hours ago