కేసీయార్ కొత్తపార్టీ కలకలం రేపుతున్నట్లుంది. కొత్తపార్టీ రేపుతున్న కలకలం తెలంగాణాలో కన్నా ఏపీలోనే ఎక్కువగా కనబడుతోంది. తెలంగాణాలో టీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే అధికారంలో ఉంది కాబట్టి ఇతర పార్టీల నుండి వచ్చి జాతీయపార్టీలో చేరబోయే నేతలు పెద్దగా ఉండరు. ఎందుకంటే జాతీయపార్టీలో పనిచేయటానికి తెలంగాణాలోనే కావాల్సినంత మంది నేతలున్నారు. కొత్తగా ఏర్పాటవ్వబోయే జాతీయపార్టీలో పనిచేయటానికి మిగిలిన రాష్ట్రాల్లోనే నేతల అవసరం చాలావుంది.
మిగిలిన రాష్ట్రాల్లో జాతీయపార్టీ పరిస్ధితి ఎలాగున్నా ఏపీలో కీలకంగా మారబోతోంది. ఎందుకంటే పొరుగునున్న ఏపీలోనే కేసీయార్ పార్టీకి ఆధరణ లేకపోతే మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకుంటుంది ? అనే ప్రశ్నలు మొదలవుతాయి. అందుకనే కేసీయార్ పర్సనల్ గా ఏపీలోని వివిధ పార్టీల నేతలకు గాలమేస్తున్నారట. కాంగ్రెస్, టీడీపీల్లోని తన సన్నిహితుల్లో కొందరికి తానే నేరుగా ఫోన్లు చేసి మాట్లాడారట. మరికొందరికి తన సన్నిహితుల ద్వారా మాట్లాడించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇలా ఫోన్లు అందుకున్నవారిలో అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్, ఉత్తరాంధ్రలో కొణతాల రామకృష్ణ పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళు కాకుండా పై రెండు పార్టీల్లోని చాలామందితో టీఆర్ఎస్ ముఖ్యులు టచ్ లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నేతలు కేసీయార్ పార్టీలోకి మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎంతకాలం కాంగ్రెస్ లో ఉన్నా ఎలాంటి ఉపయోగం ఉండదని ఇప్పటికే అర్ధమైపోయింది.
ఉపయోగం లేని పార్టీలో ఉండేబదులు కనీసం కొత్తపార్టీలో చేరితో ఏమైనా భవిష్యత్తు ఉంటుందేమో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సరిగ్గా ఈ పాయింట్ మీద కేసీయార్ అయినా టీఆర్ఎస్ సీనియర్లైనా కాంగ్రెస్, టీడీపీ నేతలకు గాలమేస్తున్నారట. మరి ఆ గేలానికి తగులుకునే వాళ్ళు ఎవరో తెలీటం లేదు. ఒక్కోసారి కొన్ని పేర్లు ప్రచారంలోకి వస్తుండటంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగుతోంది.
This post was last modified on October 6, 2022 11:32 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…