అవును.. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. అధికార పార్టీకి వచ్చే ఓట్లెన్ని..సీట్లెన్ని.. ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. కొన్నాళ్లుగా.. ఈ చర్చ సాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీనే.. దీనిపై దృష్టి పెట్టింది. నిజమే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లిపోతే.. మనకు ఎన్ని స్థానాల్లో విజయం దక్కుతుంది? గతంలో తెచ్చుకున్న 49.9 శాతం ఓటు బ్యాంకు నిలుస్తుందా? అని అంతర్మథనం చెందింది. ఈ క్రమం లోనే తనకు ఉన్న ఇంటిలిజెన్స్, వలంటీర్ వ్యవస్థ ద్వారా.. సమాచారం తెప్పించుకున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలో స్థానికంగా.. బలంగా ఉన్న నాయకులు.. గెలిచే స్థానాలపై సమాచారం సేకరించింది. సంక్షేమ పథకాలు అందుతున్న కుటుంబాల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కేవలం 60 -70 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందని తెలిసింది. అది కూడా.. సీమలోని రెండు జిల్లాల్లో ఎక్కువగా ఉంటే.. ఇతర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో.. పాజిటివిటీ ఉంది.
ఇక్కడ ఒకింత సంక్షేమ పథకాలు అందుతున్న వారితోపాటు.. రెడ్డి సామాజిక వర్గం.. అనుకూలంగా ఉన్నట్టు తేలింది. అయితే.. గతంలో 2019.. లో వచ్చిన రిజల్ట్ అయితే.. రాదని స్పష్టంగా తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం తటస్థంగా ఉందని.. అందుకే.. గత ఫలితం వచ్చే అవకాశం లేదని..దాదాపు తేలిపోయింది. ఇక, ఎస్సీ, ఎస్టీల్లో కొంత మేరకు వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఓటు బ్యాంకు విషయానికి వస్తే.. ఏ మేరకు పడుతుందనేది కూడా డౌట్‌గా మారడం.. ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం.
ఇక, కోస్తాలో ఎక్కువగా మూడు రాజధానులపై మొగ్గు చూపడం లేదు.పైగా.. అమరావతి అయితే.. బెటర్ అనే భావన ఉంది. లేదా.. విజయవాడ-గుంటూరు జంటనగరాల కాన్సెప్టును తీసుకురావాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ వైసీపీ ఓటు బ్యాంకు తగ్గిపోయింది. ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ స్మరణ తగ్గిపోయింది. విశాఖలో రాజధాని ప్రకటన కొంత మేరకు ఊపు తెచ్చినా.. వనరులు దోచేస్తున్నారనే ప్రచారం.. వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. కేవలం 60 సీట్లు లేదా.. ఒకటి రెండు స్థానాల్లోనూ సత్తా చూపడం సాధ్యమని అంటున్నారు.
This post was last modified on October 5, 2022 1:33 pm
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…