యూట్యూబర్, సోషల్ మీడియా సెలబ్రిటీ గంగవ్వ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ‘మై విలేజ్ షో’ ఛానల్ తో పాపులర్ అయిన గంగవ్వ తనదైన మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత ఏకంగా బిగ్ బాస్ షో లోనే పాల్గొన్న గంగవ్వ మరింత ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే కరీంనగర్ కళోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ గంగవ్వను కలిశారు. ఈ సందర్భంగా గంగవ్వ నిర్వహిస్తున్న మై విలేజ్ షో పై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.
తనకు తెలిసిన నాలుగు విషయాలను తన షో ద్వారా గంగవ్వ అందరికీ చెబుతోందని కేటీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా వేదిక పైకి గంగవ్వని పిలిచిన కేటీఆర్ ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తనను మహేష్ బాబు అంటూ గంగవ్వ చేసిన కామెంట్లపై కేటీఆర్ సెటైరికల్ గా స్పందించారు. గంగవ్వ ఇచ్చిన కాంప్లిమెంట్ కు కేటీఆర్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఆ కాంప్లిమెంట్ తో తనకేం ప్రాబ్లం లేదని, కానీ ఈ మాట వింటే మహేష్ బాబు ఫీల్ అవుతాడని కేటీఆర్ సెటైర్ వేశారు.
అంతేకాదు, తనను మహేష్ బాబు అనుకుంటున్న గంగవ్వ కళ్ళు ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోవాలంటూ చమత్కరించారు. ఇక, మై విలేజ్ షోలో తాను పాల్గొంటానని గంగవ్వకు మాట ఇచ్చానని, త్వరలోనే ఆ షోలో తప్పకుండా పాల్గొంటానని కేటీఆర్ స్వయంగా చెప్పారు.
తనకు తెలిసిన నాలుగు విషయాలు చెప్పి, తెలియని విషయాలు నేర్చుకుంటానని అన్నారు. ఇక, మై విలేజ్ షోలో పాల్గొంటున్న విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. ఏది ఏమైనా, గంగవ్వపై కేటీఆర్ ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on October 3, 2022 8:11 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…
అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…
దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…