భారత దేశానికి స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే అనే హిందూ అతివాది హతమార్చిన సంగతి తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో గాంధీజీని కొన్ని హిందుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పటికీ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోల్‌కతాలో అఖిల భారత హిందూ మహాసభ నిర్వహించిన దుర్గా పూజలో జాతిపితకు ఘోర అవమానం జరిగింది.
గాంధీజీని మహిషాసురుడుగా చూపిస్తూ తయారు చేసిన విగ్రహాన్ని ఆ పూజలో పెట్టడం వివాదాస్పదమైంది. ఓ మండపంలో దుర్గామాత కాళ్ల కింద ఉన్న మహిషాసురుడికి గాంధీముఖాన్ని పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసుల ఆదేశాల ప్రకారం నిర్వాహకులు గాంధీజీ ముఖాన్ని తొలగించారు. ఈ చర్యను బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ-ఎం, కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి.
ఈ క్రమంలోనే, ఈ వ్యవహారంపై అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి స్పందించారు. ఆ విగ్రహంలో గాంధీజి తల పొరపాటున వచ్చిందని, పోలీసులు చెప్పడంతో దానిని తాము వెంటనే తొలగించామని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. అయితే, కావాలనే ఆ విగ్రహంలో గాంధీజీ తలను పెట్టారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. విగ్రహం తయారీదారులు ఇలా చేయరని, కొందరు గాంధీ వ్యతిరేక నేతలు ఇలా చేయించి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on October 3, 2022 7:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…