మునుగోడు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఆ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం తీర్థం పుచ్చుకోవడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
ఇక, సిట్టింగ్ స్థానాన్ని పదిలం చేసుకోవాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ గా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపఎన్నిక షెడ్యూల్ తో సంబంధం లేకుండా కొద్దిరోజుల నుంచే ఎన్నికల ప్రచారాన్ని కూడా అన్ని పార్టీలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగబోతోంది. అక్టోబర్ 7న ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇక, నవంబర్ 6న మునుగోడు బైపోల్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉపఎన్నిక షెడ్యూల్ కూడా విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాలని భావిస్తున్నాయి.
మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 7
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 14
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ తేదీ: నవంబర్ 3
మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 6
This post was last modified on October 3, 2022 7:31 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…