ఏపీ రాజధాని అమరావతి రైతులపై వైసీపీ మంత్రులు, నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. కాకినాడ దిశగా సాగుతున్న రైతుల మహాపాదయాత్ర 2.0ను అడ్డుకోవాలని.. సాక్షాత్తూ.. మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. నిజానికి మంత్రిగా బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఆయన అలా వ్యవహరించడం.. వివాదానికి దారితీసింది. అయినా.. ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇక, తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదే రేంజ్‌లో వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై ఎమ్మెల్సీ దువ్వాడ ఘాటుగా స్పందించారు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర నిర్వహించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏదైనా దుష్పరిణామం జరిగితే దానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని అన్నారు. పాదయాత్ర చేస్తున్న వారు అసలు రైతులే కాదని.. వారంతా పెయిడ్ ఆర్టిస్టులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా యాత్రలు చేస్తే సహించేదిలేదన్నారు.
చంద్రబాబు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అచ్చెన్నాయుడు పెట్టుబడి దారుడని ఆరోపించారు. పాదయాత్ర వెనక్కి మళ్లీంచాలని.. లేకుంటే జరిగే ప్రతి దుష్పరిణామానికి చంద్రబాబే బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మా ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి చూస్తే చూస్తు ఊరుకోమన్నారు.
ఉత్తరాంధ్రలో రాజధానిని వ్యతిరేకిస్తున్న అచ్చెనాయుడుకి రాజకీయ పతనం తప్పదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడును ఘోరంగా ఓడించి తీరుతామన్నారు. రాజధాని రైతులు ఉత్తరాంధ్రలోకి అడుగు పెడితే.. కాళ్లు విరగ్గోట్టేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on October 2, 2022 2:11 pm
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…
గత వారం కంగువ, మట్కాలు తీవ్రంగా నిరాశపరచడంతో థియేటర్లు నవంబర్ 22 కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్…