గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నానిపై టీడీపీ నేతలు కొద్ది రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లను టార్గెట్ చేస్తూ కొడాలి నాని చేసే అసభ్యకర వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చి సైలెంట్ అయ్యే టీడీపీ నేతలు..ఇటీవలి కాలంలో కొడాలి నానిపై కేసు పెట్టే వరకూ వెళ్లారు.
ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారట. నాని ఓటమే లక్ష్యంగా ఆపరేషన్ కొడాలి నానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారట. అయితే, గుడివాడలో పాతుకుపోయిన కొడాలి నానిపై పోటీ చేసేందుకు ఎవరిని రంగంలోకి దింపాలి అని చంద్రబాబు ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టారట. గుడివాడలో టీడీపీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు అక్కడ కొడాలి నానిని దీటుగా ఎదురుకోగల్గిన నేతకు టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట.
వాస్తవానికి వంగవీటి రాధాను…కొడాలి నానిపై పోటీకి దించాలని గతంలో చంద్రబాబు భావించారట. అయితే, కొడాలి నాని…రాధాల మధ్య స్నేహబంధం మరింత బలపడడంతో ఆ ఆలోచనను చంద్రబాబు విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొడాలి నానిపై పోటీకి తాను సిద్ధమంటూ ప్రకటించిన దేవినేని ఉమకే గుడివాడ టికెట్ ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ జనసేనతో టీడీపీకి పొత్తు ఉన్నా సరే కొడాలి నానిని ఓడించాలని పవన్ కళ్యాణ్ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఉమ అభ్యర్థిత్వాన్ని పవన్ కూడా బలపరుస్తారని అనుకుంటున్నారట.
పొత్తు కుదిరితే గుడివాడ టికెట్ ను జనసేన వదులుకునేందుకు సిద్ధంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు అనుకుంటున్నారట. ఆపరేషన్ కొడాలి నాని సక్సెస్ అవుతుందా? కొడాలికి దేవినేని చెక్ పెడతారా? చంద్రబాబు, టీడీపీ నేతల ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
This post was last modified on September 29, 2022 10:21 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…