Political News

జగన్ ఏప్పుడైనా ప్రసాదం తినడం చూశారా?

తప్పు చేసి అప్పు కూడు.. అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం తీరు ఉందని రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌ ఎద్దేవా చేశారు. మంగ‌ళ‌వారంతో రూ. 49 వేల కోట్లు అప్పు చేశారని, అందులో రూ. 8 వేల కోట్లు దొంగ అప్పు ఉందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది రుణం దాటేసిందని, ఈ విషయం కేంద్రం కూడా చెప్పిందన్నారు. రాష్ట్రంలో రుణ వేట జరుగుతోందని, వేటగాడు అడవికి వెళ్లినట్టు.. ఢిల్లీకి మంత్రి బుగ్గన రుణ వేటలో తిరుగుతున్నారన్నారని ఎద్దేవా చేశారు.

సర్పంచ్‌లు అయితే పంచాయితీకి నిధులు రావడం లేదని వాపోతున్నారన్నారు. ఈ సందర్భంగా ‘ముఖ్యమంత్రి జగన్, బుగ్గన రాజేంద్రనాధ్‌లకు ఒకటే అడుగుతున్నా.. 6 నెలల్లో రూ. 49 వేల కోట్ల అప్పు నిజమా కాదా?’ ఈ డబ్బులు అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. నిన్న ముఖ్యమంత్రి జగన్ తిరుపతి యాత్రకు వచ్చారని.. హిందూ సంప్రదాయం ప్రకారం గుడిలోకి వెళ్తే ప్రసాదం తీసుకుంటాం.. కానీ జగన్ శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదం తీసుకోలేదని విమర్శించారు. జగన్ క్రిస్టియన్ అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

విశాఖకు రైల్వేజోన్ రాకపోతే రాజీనామా చేస్తానన్న విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై రఘురామ స్పందించా రు. నిన్నటి కేంద్ర హోంశాఖ అధికారుల సమావేశానికి రైల్వే బోర్డు చైర్మన్ కూడా వచ్చారని, రైల్వే జోన్ సాధ్యం కాదని సమావేశంలో చెప్పారని.. విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మహిళలపై పోస్టులు చేస్తున్నారని, అది మంచిది కాదన్నారు. మహిళలు ఉమ్మేస్తే అందులో కొట్టుకుపోతారన్నారు. ఈ విధంగా ఉంటే పులివెందుల్లో కూడా గెలవడం కష్టమని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

This post was last modified on September 28, 2022 6:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

31 minutes ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

41 minutes ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

2 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

3 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

3 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

4 hours ago