Political News

మూడు రాజ‌ధానులు కాదు.. ఏపీని మూడు రాష్ట్రాలు చేయండి: జ‌గ్గారెడ్డి

ఏపీ ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. త‌న విమ‌ర్శ‌ల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. సోమ‌వారం.. ఆయ‌న హెల్త్ యూనివ‌ర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొల‌గించ‌డంపై తీవ్రంగా స్పందించారు. సీఎం జ‌గ‌న్‌..అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా.. ఫ్యాక్ష‌న్ అల‌వాట్లు నిర్ణ‌యాలు మార్చుకోవ‌డం లేద‌ని.. దుయ్య‌బ‌ట్టారు. పేరు మార్పు స‌రికాద‌న్నారు. రేపు వ‌చ్చే ప్ర‌భుత్వం.. వైఎస్ పేరు తీసేస్తే.. అది ఆయ‌న‌కు అవ‌మానం కాదా అని ప్ర‌శ్నించారు.

తాజాగా మంగ‌ళ‌వారం కూడా.. జ‌గ్గారెడ్డి.. ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాల‌పై విరుచుకుప‌డ్డారు. మూడు రాజ‌ధానులు ఎందుకు.. ఏకంగా.. ఏపీని మూడు ముక్క‌లు చేసి.. మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటే.. జ‌గ‌న్ , ఆయ‌న సోద‌రి.. ఆయ‌న స‌న్నిహితుడు.. విజ‌యసాయిరెడ్డిలు ముఖ్య‌మంత్రులుగా చ‌క్రాలు తిప్పొచ్చ‌ని.. స‌టైర్లు రువ్వారు. దీంతో కుటుంబంలో నెల‌కొన్న రాజ‌కీయ వివాదం కూడా స‌మ‌సిపోతుంద‌న్నారు. త‌న కుటుంబ వివాదాన్ని తెలంగాణ‌కు తీసుకువ‌చ్చిన ష‌ర్మిల ఏదైనా ఉంటే.. ప్ర‌ధాని మోడీతో మాట్లాడి చ‌ర్చించుకుని.. ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు.

ఇదే స‌మ‌యంలో ష‌ర్మిల‌పై జ‌గ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ‘నన్ను వ్యభిచారి అంటావా? బుద్ది ఉందా నీకు..?’ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తనను వ్యభిచారి అంటే ఏమీ కాదని.. కానీ అదే మాట తానంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్‌ లో ఉన్నప్పుడే పులిని అని పేర్కొన్నారు. వైఎస్‌తో ఉన్నప్పుడు పులి, ఇప్పుడు పిల్లిలా ఉన్నా అనే షర్మిల మాట అబద్ధమన్నారు. తాను టీఆర్ఎస్‌లో ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో తనను కట్టడి చేయడానికి పోలీస్‌ను ఉపయోగించారన్నారు.

పోలీస్‌లు లిమిట్ క్రాస్ చేయడంతో అప్పట్లో తాను రిగ్గింగ్ చేశానన్నారు. తన స్టైల్ నచ్చి వైఎస్ పిలిచారని… అభివృద్ధి కోసం ఆనాడు వెళ్ళానన్నారు. ఇంకా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “షర్మిల హద్దుల్లో ఉండాలి. వైయస్ పరువు తీయొద్దు. షర్మిల పెద్ద మోతుబరి కాదు… అసలు ఆమె పంచాయితీ ఏంటో తెలియడం లేదు. ఆమె పాదయాత్ర ఎందుకు చేస్తుందనేది క్వశ్చన్ మార్క్. నన్ను కేటీఆర్ కోవర్ట్ అనడం దురదృష్టకరం. షర్మిల సీఎం కావాలనేది ఆమె కోరిక అని.. ఆమె తల్లి కూడా అదే చెప్పారు” అని వ్యాఖ్యానించారు.

షర్మిల ఏపీలో ఎందుకు తిరగడం లేదన్నారు. జగన్‌కు చెప్పి షర్మిలను ఏపీ సీఎం చేయాలని విజయమ్మకు సలహా ఇస్తున్నాన‌న్నారు. “మీ కుటుంబ సభ్యులంతా సీఎంలుగా ఉండాలనేది మీ కోరిక. మీ ఇంటి పంచాయతీని మా మీద రుద్దకండి. ఏపీకి మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండి. మూడు రాష్ట్రాలకు మీ ముగ్గురు సీఎంలు కండి. మీకు ముఖ్యమంత్రి పదవుల కోసం రెండు రాష్ట్రాలను నాశనం చేస్తారా? వైయస్ బిడ్డ అని మిమ్మల్ని ఎవరు తిట్టలేక పోతున్నారు. షర్మిల పక్కా బీజేపీ ఏజెంట్, బీజేపీ బినామీ” అని జ‌గ్గారెడ్డి నిప్పులు చెరిగారు.

This post was last modified on September 27, 2022 10:09 pm

Share

Recent Posts

జాన్విని మ‌ళ్లీ చూస్తామా?

బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేట‌స్ సంపాదించాక‌, తెలుగులో…

4 hours ago

చివరి సినిమా చేదు జ్ఞాపకమే అయ్యింది

గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…

5 hours ago

వైసీపీ నాయకులకు సరైన భరోసా లేదా?

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై కేసులు కొన‌సాగుతున్నాయి. అనేక మంది నాయ‌కుల‌పై కేసులు న‌మోదై... ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్నాయి.…

5 hours ago

‘జగన్ వస్తున్నారా.. అయితే మూతే’

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…

5 hours ago

వైసీపీకి చెక్‌: మండలి వైస్ చైర్మన్‌పై కూటమి కీలక నిర్ణయం!

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…

5 hours ago

గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…

5 hours ago