వైసీపీలో ఎక్కడికక్కడ అసంతృప్తి సెగలు పొగలు కక్కుతున్నాయి. అది కూడా.. ఏదో ఎమ్మెల్యేల మధ్యో.. మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేల మధ్యో వివాదాలు కావు.. ఏకంగా.. క్షేత్రస్థాయిలో రేపు ప్రజల దగ్గరకు వెళ్లి.. వారితో మాట్లాడి.. ఓట్లు వేయించాల్సిన.. స్థానిక సంస్థల ప్రతినిధుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. తమకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని.. కనీసం.. ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని.. వారు వాపోతున్నారు.
గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో చోటు చేసుకున్న ఐదు ఘటనలు వైసీపీలో అసంతృప్తులు ఏ రేంజ్‌లో ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు వ్యతిరేకంగా.. ఇటీవల మండలాధ్యక్షులు రోడ్డెక్కారు. ఇక, మంత్రి రాజన్నదొరకువ్యతిరేకంగా.. సొంత పార్టీవారే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. తూర్పులోనూ.. పశ్చిమలోనూ.. ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరులోనూ.. అసంతృప్తి జ్వాలలు.. కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా ఇవి అదుపులోకి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. తాజాగా.. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే ఆదిమూలంకు వ్యతిరేకంగా.. ఎంపీపీ రోడ్డెక్కిన ఘటన పార్టీలో చర్చకు దారితీసింది. చేయూత చెక్కుల పంపిణీ కార్యక్ర మానికి పిలిచి మరీ.. ఆయనను వేదికపై అవమానించినట్టు పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. నేరుగా ఈ కార్యక్రమం నుంచి చెక్కులు కూడా పంపిణీ చేయకుండానే ఆయన కిందికి దిగిపోయారు.
ఇక, విజయవాడ పశ్చిమలోనూ.. మాజీ మంత్రి వెల్లంపల్లికి వ్యతిరేకంగా.. పోస్టర్లు పడ్డాయి. ఆయన హవా ఇక్కడ కొనసాగుతున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా.. ప్రతిపక్షాలు కూడా ఇప్పటి వరకు పోస్టర్లు అంటించలేదు. కానీ, తాజాగా రెండు రోజుల కిందట..”మాకు ఏం చేశారు మాజీ మంత్రిగారూ!” అని పేర్కొంటూ.. వెలిసిన పోస్టర్లు.. సొంత నాయకుల పనేనని మాజీ మంత్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. రాష్ట్రంలోని ఉమ్మడి 9 జిల్లాల్లో పార్టీలోఅసంతతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
అయినా.. కూడా.. పార్టీ అదిష్టానం ఎక్కడా ఏ విషయాన్ని పట్టించుకునే పరిస్థితి లేకపోవడం గమనార్హం. మరి వారే సర్దుకుంటారని భావిస్తున్నారో.. లేక .. ఆయా స్థానాల్లో ఎలాగూ కొత్తవారికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారో.. చూడాలి.
This post was last modified on September 27, 2022 6:25 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…