మునుగోడు ఉపఎన్నికలో గెలుపు బీజేపీ అత్యంత ప్రతిష్టగా మారింది. ఒకపుడు ఉపఎన్నికలో ఈజీగా గెలిచిపోతామనే నమ్మకం బలంగా ఉండేది. కారణం ఏమిటంటే కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఇచ్చిని బిల్డప్పే. కాంగ్రెస్ లో రాజీనామా చేసి రేపటి ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. కోమటిరెడ్డి బిల్డప్ చూసి అంతోడు ఇంతోడని కమలనాదులు కూడా అనుకున్నట్లున్నారు.
అయితే పార్టీలో చేరిన ప్రచారంలోకి దిగిన తర్వాత అసలు విషయం మెల్లిగా బయటపడుతోంది. రాజగోపాల్ చెప్పకున్నంతగా ఆయనకు సీన్ లేదట. ఎందుకంటే తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరగానే తన మద్దతుదారులంతా తనతో పాటే వచ్చేస్తారని కోమటిరెడ్డి చెప్పారట. అయితే చాలామంది నేతలు రాజగోపాల్ తో బీజేపీలోకి రాలేదు. తామంతా కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతామని గట్టిగానే చెప్పారట. ఇదే సమయంలో ప్రచారానికి నియోజకవర్గంలో తిరుగుతుంటే ఎదురుదెబ్బలు తగులుతున్నాయట.
కాంగ్రెస్ పార్టీ మంచిగా చూసుకుంటున్న తర్వాత కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటు కొన్ని గ్రామాల్లో జనాలు నిలదీస్తున్నారట. అలాగే 2018 ఎన్నికల్లో పోటీచేసినపుడు ప్రభుత్వం చేయకపోతే తానే సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారట. గెలిచిన తర్వాత మళ్ళీ గ్రామాల మొహాలే చూడలేదట. రాజీనామా చేసిన కారణంగా బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు కాబట్టి ఓట్ల కోసం తమ దగ్గరకు వచ్చారని చెప్పి నాలుగైదు గ్రామాల ప్రజలు మండిపోయారు.
రాజగోపాల్ ఏదో చెప్పబోయినా జనాలు ప్రచారం చేసుకోనియ్యలేదు. ఇదంతా చూసిన తర్వాత బీజేపీ నేతలు తాజాగా 16 మందితో ప్రత్యేకంగా కమిటీని వేశారు. ప్రచారం, చేరికలు, ఎన్నికల వ్యూహాలు సమస్తం ఇదే కమిటి చూసుకుంటుందట. బీజేపీలో చేరకముందే ఎన్నికల వ్యవహారం మొత్తాన్ని తానే చూసుకుంటానని రాజగోపాల్ చెప్పారట. ఆయన మాటవిని మొత్తం ఆయనకే వదిలేస్తే దెబ్బపడక తప్పదని అర్ధమైందట. అందుకనే 16 మందితో కమిటి వేశారు.
This post was last modified on September 25, 2022 10:53 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…