అత్యంత ప్రతిష్ట గా మారిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారం చేసిన రాజగోపాల్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తప్పేంటని రైతులను నిలదీశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల ఏ రైతు ఎంత విద్యుత్ వాడుతున్నారో లెక్క తేలుతుంది కదా అంటు రైతులనే ప్రశ్నించారు. ఒకవైపు కేసీయార్ ఏమో ఎక్కడ మాట్లాడినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటమంటే రైతులకు ఉరివేసినట్లే అని పదే పదే చెబుతున్నారు.
మోటార్లకు మీటర్లు బిగించాలన్న కేంద్ర నిబంధంనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోటార్లకు మీటర్ల బిగుంపును వ్యతిరేకిస్తున్నట్లే మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఏదో అయిపోతుందనే ఆందోళన రైతుల్లో కూడా పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తప్పేంటని రాజగోపాల్ రైతులను ప్రశ్నించారు.
అంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాల్సిందే అన్నట్లుగా బీజేపీ అభ్యర్ధి మాటలున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటం తప్పదు అని మాజీ ఎంఎల్ఏ రైతులను హెచ్చరిస్తున్నట్లే ఉంది. ఎప్పుడైతే మోటార్లకు మీటర్లకు మద్దతుగా రాజగోపాల్ మాట్లాడారో వెంటనే కమలనాథుల్లో ఆందోళన మొదలైపోయింది. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు బిగించటమనే విషయం వివాదాస్పద మైపోయింది.
దీని కారణంగానే ఒకపుడు గట్టిగా పట్టుబట్టిన కేంద్రం ఇపుడు పెద్దగా పట్టించుకోవటంలేదు. నిజానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించటంలో తప్పేలేదు. కేంద్రం చెప్పిందేమంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చుకోవటం రాష్ట్రాల ఇష్టమని. అయితే ఉచిత విద్యుత్ లో కూడా ఎవరెంత వాడుతున్నారో లెక్కలు తేలాలంటే ప్రతి మోటారుకు మీటరుంటే కానీ లెక్కలు తేలదని చెప్పింది. దీన్నే కొన్ని ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. మరిపుడు రాజగోపాల్ వాదన జనాల్లోకి వెళ్ళిపోయింది. మరి రేపటి ఉపఎన్నికలో ప్రభావం ఎలాగుంటందో చూడాలి.
This post was last modified on September 24, 2022 5:59 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…