విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ.. మూడు రోజుల కిందట.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దివంగత వైఎస్సార్.. వైద్య రంగానికి ఎన్నో చేశారని.. ఆయన సేవలకు సరైన గుర్తింపు రాలేదని.. ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. అందుకే.. ఎన్టీఆర్ పేరు మార్చి.. వైఎస్సార్.. హెల్త్ యూనివర్సిటీగా పేరు పెడుతున్నామని చెప్పారు. ఎన్టీఆర్ అంటే..తనకు ఎనలేని అభిమానమన్నారు.
అంతేకాదు.. చంద్రబాబు కన్నా.. కూడా తనకే ఎన్టీఆర్ అంటే.. అమితమైన గౌరవం ఉన్నాయని.. అందుకే ఏకంగా ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని సీఎం జగన్ చెప్పారు. అయితే.. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ సహా అన్ని రాజకీయ పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కుటుంబం కూడా.. స్పందించి..జగన్ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇప్పటికే.. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సహా.. ఇతర కుటుంబ సభ్యులు కూడా విరుచుకుపడ్డారు.
మరోసారి.. బాలయ్య తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై మండిపడిన ఆయన.. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్ అని తెలిపారు. తండ్రి(వైఎస్) గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు పేరు మార్చారని, కుమారుడు(జగన్) గద్దెనెక్కి వర్సిటీ పేరు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాలయ్య వ్యాఖ్యానించారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. అంటూ.. ఎన్టీఆర్ హయాంలో రాజకీయాల్లోకి వచ్చి.. ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని పరోక్షంగా బాలయ్య దుయ్యబట్టారు.
This post was last modified on September 24, 2022 11:26 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…